బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు రికార్డ్స్ బ్రేక్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మణికర్ణిక, భారత్, కబీర్ సింగ్..ఇలా చెప్పుకుంటు పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఇది ఒక్క బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, కోలీవుడ్ ..ఇలా ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోను ఇలాంటి రికార్డ్స్ చూస్తునే ఉన్నాము. అయితే కొన్ని సినిమాలు మాత్రం అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రిజల్ట్ విషయంలో సంచనాలను సృష్ఠిస్తుంది. అలాంటి సినిమానే ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త రికార్డ్ ను క్రియోట్ చేసిందని బాలీవుడ్ మీడియా సమాచారం. 

హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం వార్ మొదటిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసి ఈ ఏడాదికి హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచి చిన్న షాకిచ్చింది. మొదటి రోజు 51.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ తో సల్మాన్ ఖాన్ సినిమా 'భరత్' ను వెనక్కు నెట్టింది.
దాదాపుగా ఈ సినిమాకు క్రిటిక్స్ అందరూ యావరేజ్.. డీసెంట్ అంటూ రివ్యూలు ఇచ్చారు కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం భారీగా ఉన్నాయి.  హిందీ సినిమాల వరకూ చూసుకుంటే గతంలో హయ్యెస్ట్ డే వన్ కలెక్షన్ రికార్డు అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కూడా 'వార్' తుడిచిపెట్టేసింది. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' మొదటి రోజు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దాటిన మొదటి సినిమా కాగా ఇప్పుడు 'వార్' ఆ సినిమాను చాలా సులభంగా అధిగమించిందని బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

2019 లో హయ్యెస్ట్ డే వన్ కలెక్షన్స్ సాధించిన టాప్ -5  హిందీ చిత్రాల లిస్టు లో చూసుకుంటే ఇండియా - నెట్ కలెక్షన్స్ పరంగా వార్ దే హయ్యెస్ట్ అని తేలింది.  వార్: 53.35 కోట్లు, భారత్ 42.30 కోట్లు, మిషన్ మంగళ్: 29.16 కోట్లు, సాహో: 24.40 (హిందీ వెర్షన్), కళంక్: 21.60 కోట్ల.. కలెక్షన్స్ ను సాధించాయి.  అయితే ఈ వారం రిలీజైన మూడు భారీ బడ్జెట్ సినిమాలు టాలీవుడ్.. సైరా, బాలీవుడ్.. వార్, హాలీవుడ్.. జోకర్ సినిమాలను గనక తీసుకుంటే సైరా, వార్ కంటే కూడా జోకర్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించనట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: