ఒకేరోజు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి మూడు భారీ సినిమాలు భారీ అంచనాలతో రిలీజయ్యాయి. ఆ సినిమాలలలో ఒకటి తెలుగు సినిమా 'సైరా నరసింహారెడ్డి'. మరొకటి బాలీవుడ్ సినిమా 'వార్'.. ఇంకొకటి హాలీవుడ్ సినిమా 'జోకర్'. ఒక్కో భాష నుంచి ఒక్కో సినిమా. ఈ మూడు సినిమాలు ఎంతో క్రేజుతో బారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రిలీజైనవే. వాస్తవానికి ఈ మూడు సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు బాగానే ఉన్నాయి. అయితే ఈ మూడు సినిమాల మీదా పాజిటివ్ టాక్ తో పాటు కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చి ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజన్ లో పడేశాయి.  

ముఖ్యంగా చెప్పుకోవలసింది సైరా గురించి. సాహో మాదిరిగా అన్నీ భాషల్లోను భారీ స్థాయిలో రిలీజైంది. మిగతా రెండు సినిమాలు మాత్రం స్ట్రైట్ గా ను.. వార్ తెలుగు డబ్బింగ్ సినిమా గాను రిలీజైంది. అయితే బాలీవుడ్ లో భారీ అంచనాలు పెట్టుకున్న చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి తెలుగులో మినహా మిగిలిన భాషల్లో మొదటిరోజు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టుకోలేదు. మొత్తం దేశవ్యాప్తంగా మొదటిరోజు 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అందులో చాలావరకు తెలుగు నుండి వచ్చిన కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. 

నిర్మాత రాం చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మార్కెట్ చాలా నిరాశ పరచింది. అక్కడ మొదటిరోజు కేవలం కోటి యాభై లక్షలు షేర్ మాత్రమే రాబట్టుకోగలిగిందని తాజా సమాచారం. ఇక తమిళ - మలయాళ భాషల్లో కూడా అనుకున్నంత కలెక్షన్స్ రాలేదని క్లియర్ గా అర్థమవుతోంది. బాలీవుడ్ లో రివ్యూలు అన్నీ బాగానే వచ్చినా మొదటిరోజు కలెక్షన్స్ విషయంలో సినిమా యూనిట్ ను ఉలిక్కిపడేలా చేసింది. సైరా తో పాటు రిలీజ్ అయినా వార్ సినిమా ఎఫెక్ట్ కూడా సైరా మీద గట్టిగానే ప్రభావం చూపించింది. ఆ సినిమాకి కూడా రివ్యూలు బాగా రావడంతో హిందీ జనాలు వార్ మూవీకి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సైరా కి బాలీవుడ్ జనాలు షాకిచ్చారని దీన్ని బట్టి అర్థమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: