ఎనర్జిటిక్ స్టార్ రామ్  విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసినప్పటికీ రామ్ కి మాత్రం సరైన హిట్ లేక పోయింది.... ఇక మరోవైపు డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి విభిన్న కథలు తెరకెక్కించిన సరైన విజయం  మాత్రం సాధించలేకపోయారు . అయితే ఇటు  ఎనర్జిటిక్ స్టార్ రామ్... అటు పూరి జగన్నాథ్ హిట్ కోసం పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కి విడుదలై సంచలనం సృష్టించింది. వీళ్ళిద్దరికీ ఒకేసారి మామూలు హిట్ కాదు  బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసింది. పూరి టేకింగ్ కి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎనర్జీ  తోడవడంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్స్ ఆఫీస్ వద్ద  బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలిచింది. కాగా ఇస్మార్ట్  శంకర్ లో రామ్ చెప్పిన మాస్ డైలాగ్ లు అందరు ప్రేక్షకులను  ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

 

 

 

 

 

 

 కొన్ని రోజుల వరకు ఈ స్మార్ట్ శంకర్ మేనియా నడిచింది అంటే అతిశయోక్తి కాదు. అయితే తెలుగులో మంచి విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ని ఇతర భాషల్లో కూడా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇస్మార్ట్ శంకర్ రీమిక్స్ రైట్స్ కోసం హిందీ తమిళం నుంచి ఆఫర్లు కూడా వచ్చాయట. అయితే హిందీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇస్మార్ట్ శంకర్ ని  రీమేక్ రైట్స్ దక్కించుకుని... రీమేక్ చేయటానిక సిద్ధంగా ఉన్నట్లు  సమాచారం. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీ లో రామ్ పాత్రలో  బాలీవుడ్ స్టార్ హీరో విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రణ్ వీర్  సింగ్ నటించనున్నాడని సమాచారం.

 

 

 

 

 

 అయితే సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారన్నది  మాత్రం తెలియాల్సి ఉంది. కాగా తమిళంలో కూడా ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకుందట ఓ  నిర్మాణ సంస్థ అయితే ఈ సినిమాలో రామ్ పాత్రలో ధనుష్ నటించనున్నాడని సమాచారం. కాగా  టాలీవుడ్ ప్రేక్షకులను తన మాస్ డైలాగ్స్ తో ఒక ఊపు ఊపేసిన ఇస్మార్ట్  శంకర్ మూవీ... హిందీ తమిళ భాషల్లో ఎలాంటి రికార్డు సృష్టిస్తుంది అక్కడి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: