తెలుగులో స్టార్ స్టేటస్ ఉన్న హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమాలు సినిమాలు తెలుగులోనే కాదు మళయాలంలో కూడా రిలీజ్ అవుతుంటాయి. తెలుగులో ఉన్న అభిమానులతో పాటు మళయాలంలో కూడా అభిమానులు ఉన్నారు. ఈ మధ్య అల్లు అర్జున్ సినిమాలు హిందీలో కూడా బాగా ఆడుతున్నాయి. అల్లు అర్జున్ హిందీలో సినిమాలు చేయకపోయినప్పటికీ, తెలుగు డబ్బింగ్ సినిమాలకి యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. దీన్ని బట్టి హిందీలో కూడా అల్లు అర్జున్ కి మార్కెట్ బాగానే ఉందని తెలుస్తుంది.


 అల్లు అర్జున్ ప్రస్తుతం తన సొంత ఇంటి కలను నిజం చేసుకునే పనిలో ఉన్నాడట. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ తో కలిసి ఉంటున్నారు. తాజాగా తమ కలల ఇంటిని నిర్మించుకొని కొత్త జీవితం ప్రారంభించాలి నిర్ణయించుకున్నారు. నూతన నివాసానికి ఈరోజు శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు.తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలసి ఈరోజు ఈ కార్యక్రమమాన్ని నిర్వహించారు. ఆ ఇంటికి "బ్లెస్సింగ్" పేరు పెట్టారు.


ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు.విషయం తెలిసిన అల్లు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో "అల వైకుంఠపురములో" అనే సినిమా చేస్తున్నాడు. సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. మొన్న రిలీజైన సామజవరగమన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: