తెలుగులో వారసులకు కొదవే లేదు. ప్రస్తుతం ఉన్న హీరోలలో సగానికంటే ఎక్కువ మంది వారసులే ఉన్నారు. అయితే తాజాగా మరో వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఈ విషయం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా  ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.


ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో బెల్ల్ంకొండ గణేష్ ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉండి ప్రేక్షకులను ఆలోచనలో పడేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో సినిమా కథకు సంబంధించిన కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. టేబుల్ పై గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్.. ఆ బాటిల్ వెనక టేప్ రికార్డర్ క్యాసెట్స్ ఉన్నాయి.  ఈ ఐటెమ్స్ అన్ని చూస్తే ఇది ఖచ్చితంగా పీరియాడిక్ డ్రామా అయ్యుంటుంది. ఇక హీరో ఆ టేబుల్ పై చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. 


చేతిలో ఒక స్కెచ్ పెన్..ముందేమో కొన్ని పుస్తకాలు మరికొన్ని స్కెచ్ పెన్లు ఉన్నాయి. హీరో ఈ విధంగా కనిపిస్తున్నాడంటే ఇది పక్కా ప్రేమ కథే అయ్యుంటుందని  అనిపిస్తుంది. అయితే  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. మొన్న వచ్చిన రాక్షసుడు సినిమానే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తమ్ముడు కూడా ఎంట్రి ఇస్తుండడంతో తన ఇంటి నుండే పోటీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు.


సాయి శ్రీనివాస్ మొదటి సినిమాగా మాస్ సినిమాని ఎంచుకున్నాడు. ఇప్పుడు తమ్ముడేమో ప్రేమకథని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన వివరాలు ఇంకా ఏమీ తెలియనప్పటికీ పోస్టర్ ని చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ప్రేమ కథతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాడా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: