మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి రెండు రోజుల క్రితం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి సారి మెగాస్టార్, ఒక స్వతంత్ర సమరయోధుడి పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన స్టార్ హీరోయిన్ నయనతార జోడి కట్టగా, తమన్నా, అనుష్క, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. పరుచూరి సోదరులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి రచించిన ఈ కథకు ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా పదునైన సంభాషణలు సమకూర్చడం జరిగింది. 

అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులు ఆశించిన రేంజ్ హిట్ ని మాత్రం అందుకోలేక, కేవలం ఒక యావేజ్ సినిమాగానే మిగిలింది. ఇక తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు చాలా చోట్ల చతికిల పడ్డట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మరోవైపు అదే రోజున హృతిక్, టైగర్ ష్రాఫ్ ల కలయికలో వచ్చిన భారీ యాక్షన్ బాలీవుడ్ మూవీ వార్ కూడా బిగ్గెస్ట్ రేంజ్ లో రిలీజ్ అవడం జరిగింది. అయితే ఈ సినిమాకు కూడా కొంత మిశ్రమ స్పందన వినపడుతోంది. ఇక మరోవైపు హాలీవుడ్ సినిమా జోకర్ కూడా ఇదే రోజున రిలీజ్ అయి మంచి టాక్ ని సంపాదించింది. 

అయితే మన దేశంలోని ఒక ప్రాంతంలో భారీ సినిమాలైన సైరాను మరియు వార్ ను తలదన్నేలా జోకర్ మంచి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఇక అందుతున్న కొన్ని లెక్కల ప్రకారం, తమిళనాడులోని చెన్నై నగరంలో రెండవ రోజు జోకర్ చిత్రం రూ.19లక్షల రూపాయల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు రెండూ సరిసమానంగా రూ.14లక్షల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టాయని అంటున్నారు. ఆ విధంగా ఒక విదేశీ చిత్రం, ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ రెండు భారీ సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్ రాబట్టి వాటిని వెనక్కి నెట్టడం ఒకరకంగా ఆశ్చర్యకరం అనే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాక మూడవ రోజు బుకింగ్స్ లో కూడా వాటి రెండిటికి మించి, జోకర్ మరింత జోరు చూపిస్తోందట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: