ఈ మద్య కాలంలో వెండి తెరపై ఎన్నో బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’, కేసీఆర్ బయోపిక్ ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక బాలీవుడ్ లో దీపికా పదుకొనె నటించిన ‘పద్మావత్, కంగనా రౌనత్ నటించిన మణికర్ణిక, మోడీ బయోపిక్, సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

తమిళ నాట త్వరలో అమ్మ జయలలిత బయోపిక్ రెండు మూడు వరుసగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ ఈ నెల 2 న రిలీజ్ అయ్యింది. బ్రిటీష్ వారితో పోరాడిన మొట్టమొదటి తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా మరో పిరియాడికల్ బయోపిక్ రాబోతుంది. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి.

కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం' మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్ కానుంది.  జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో ఇప్పటి వరకు కనిపించని లుక్ తో మమ్ముట్టి అదరగొట్టబోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: