కాజల్ అగర్వాల్ కెరీర్ స్పీడ్ బాగానే ఉంది. డౌన్ ఫాల్ అనేది లేని క్రేజీ హీరోయిన్ గా భారీ ఆఫర్లతో దూసుకెళుతోంది. సౌత్లో ఉన్న దాదాపు అన్నీ భాషల్లో హీరోయిన్ గా కాజల్ ది సుదీర్ఘ ప్రస్థానం అని తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించేసింది. ఇక గత కొన్ని రోజులుగా రెండు-మూడు ఫ్లాప్ లు పడటం తో కాజల్ పనైపోయిందనుకున్న టైమ్ లో పడిలేచిన కెరటంలో ఎగసిపడింది. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా సినిమాలకు సంతకాలు చేస్తోంది. లక్కీగా భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు రావడం విశేషం. ప్రస్తుతం భారతీయుడు 2 (ఇండియన్-2) తన చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమా హిట్టు అయితే కాజల్ కెరీర్ మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది. 

అయితే తన చెల్లెలు పెళ్లి చేసుకుని సెటిలైనా.. తను మాత్రం పెళ్లి జోలికి మాత్రం వెళ్లడంలేదు. కాజల్ తోటి హీరోయిన్స్ అయిన ప్రియమణి, స్నేహ, సమంత..ఇలా కొందరు పెళ్లిళ్లు చేసుకుని కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అయితే కాజల్ మాత్రం వస్తున్న అవకాశాలను వదలకుండా సినిమాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అయితే పెళ్లి ఆలోచన ఉంది కానీ, ఇప్పుడే కాదన్నట్టుగా కాజల్ మాట్లాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వల్ తన పెళ్లి విషయంలో మరోసారి స్పందించింది. తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పింది. తనకు కాబోయే భర్త  తనలాంటి వాడు మాత్రం కాకూడదని అంటోంది. వైవిధ్యభరితమైన వాడు కావాలని.. కాజల్ అంటోంది. అలా నచ్చినవాడు కనిపిస్తే తను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని కాజల్ అగర్వాల్ చెబుతోంది!

ఇలా చెప్పడంలో అసలు ఏమాత్రం క్లారిటి దొరకడం లేదు. ఈ సమాధానం చూస్తుంటే పెళ్ళి టాపిక్ డైవర్ట్ చేయడానికే ఈ ఆన్సర్ అన్నట్టుగా ఉంది తప్ప..ఖచ్చితంగా ఇలాంటి వాడు కావాలి అన్న క్లారిటి ఇవ్వడంలేదు కాజల్. ఇదిలా ఉంటే కాజల్ నిర్మాతగా మారడానికి ప్లాన్ చేసుకుంటుంది. తనే నిర్మాతగా తక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలనేది ప్రస్తుతం కాజల్ ప్లాన్. మరి ఈ సినిమాలలో హీరోయిన్ గా తనే నటిస్తుందా..లేదా కొత్త అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: