మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. ఒకవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న తపన పడే హీరో ఆయన.  లేటెస్ట్‌గా ఒక స్పై థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌'చాణక్య'తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.  తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.  మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ సంద‌ర్భంగా గోపిచంద్ మీడియాతో  సినిమా గురించి పంచుకున్నారు.


ఇండస్ట్రీ ప్రముఖుల కోసం స్పెషల్‌ షో వేశారని తెలుస్తోంది?
 సినిమా రిలీజ్‌కి ముందు ఫైనల్‌గా వారి జడ్జిమెంట్‌ తీసుకుందామని మాకు బాగా క్లోజ్‌ సర్కిల్‌, వెల్‌ విషర్స్‌కి షో వేశాం. యునానిమస్‌గా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారు. ఆడియన్స్‌ నుండి కూడా అలాంటి రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం.


ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నారు కదా?
అనీల్‌ సుంకరగారు ఒక ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటారు. చివరి మూమెంట్‌ వరకు కూడా సినిమాకు ఇంకా బెటర్‌గా ఏమైనా చెయ్యగలమా అని తపనపడే వ్యక్తి. అలాంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అనీల్‌గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


ఇందులో మీ క్యారెక్టర్‌ గురించి?
 సినిమాలో నేను అర్జున్‌ అనే రా ఏజెంట్‌గా కన్పిస్తాను.


టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
చాణక్య అనేది మా మిషన్‌ పేరు. చాణక్య అంటే ఇంటెలిజెన్స్‌. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఇంటెలిజెన్స్‌ని ఎలా ప్లే చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే టైటిల్‌ చెప్పగానే ఈ సబ్జెక్ట్‌కి యాప్ట్‌ అనిపించింది. ఆ మిషన్‌ ఏంటనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇంటెలిజెన్స్‌ ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సినిమా ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమాలో కొంత పార్ట్‌ పాకిస్థాన్‌లో ఉంటుంది. యాక్చువల్లీ తీయాలంటే పాకిస్థాన్‌లో తెలుగు మాట్లాడరు. కానీ ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడించడం జరిగింది.


ఈ సినిమాలో మీరు బాగా ఎంజాయ్‌ చేసిన సందర్భం?
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రాక్‌ ఒకటి ఉంటుంది. అది బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. సునీల్‌, రఘుబాబు, ఆలీ, హీరోయిన్‌ కాంబినేషన్‌లో ఆ ట్రాక్‌ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్‌. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశారు.


ఈ సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడు మీకు గాయం అయింది కదా?
జైసల్మేర్‌లో షూటింగ్‌ చేసేటప్పుడు ఇంకో నాలుగు షాట్స్‌ అయితే షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందనగా లాస్ట్‌ షాట్‌లో బైక్‌ స్కిడ్‌ అయ్యి నాకు గాయం అయ్యింది. ఇంకొంచెం ఉంటే షూటింగ్‌ అయిపోయేది కదా అని ఆ టైమ్‌లో బాధ వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: