యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ ఏడాది `రాక్ష‌సుడు` చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ చాలా క‌థ‌లు విన్నారు.  రీసెంట్‌గాసంతోష్ శ్రీనివాస్ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి బెల్లంకొండ‌ శ్రీనివాస్ అంగీక‌రించారు.


త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు.
రాక్షసుడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా డిజాస్టర్‌ కావటంతో ఇబ్బందుల్లో పడ్డ సాయి శ్రీనివాస్‌ వెంటనే రాక్షసుడు సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ లోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సక్సెస్‌ విషయం ఎలా ఉన్నా హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి సినిమా నుంచి తన మార్క్‌ చూపిస్తూ వస్తున్నాడు.  అల్లుడు శ్రీను నుంచి రాక్షసుడు వరకు ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చాడు ఈ యంగ్ హీరో. మాస్ ఇమేజ్ కోసం పరితపించిన బెల్లంకొండ శ్రీనివాస్.. వరుస ఫ్లాపులను చవిచూశాడు. యాక్షన్ సినిమాలు చేస్తూ.. వచ్చిన ఈ హీరో రూట్ మార్చి.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. తమిళ హిట్ మూవీ రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  అల్లుడు శ్రీను, జయజానకీ నాయక, కవచం లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్లు చేసిన సాయి తరువాత సీత లాంటి ప్రయోగం చేసి ఫెయిల్‌ అయ్యాడు వెంటనే. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన రీమేక్‌ మూవీ రాక్షసుడుతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. సంతోష్‌ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: