మిల్కీ బ్యూటి తమన్నా తెలుగు, హిందీ, తమిళం..ఇలా అన్నీ భాషల్లో కలిపినా అలాగే కెరీర్లో చేసిన అతి పెద్ద సినిమాలు ఏవి అని చూసుకున్నా కనిపించేవి మన తెలుగు 'బాహుబలి, సైరా'. వీటిలో 'సైరా' కంటే 'బాహుబలి' సినిమానే భారీ ప్రాజెక్ట్. కానీ తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది, తన కెరీర్ మొత్తంలో టాప్ వన్ మూవీగా నిలిచే సినిమా మాత్రం 'సైరా' నే. 'బాహుబలి'లో తమన్నాసెకండ్ హీరోయిన్ అయినా.. రెండు భాగాల్లో కనిపించినా.. ఆమె పాత్ర నిడివి తక్కువ కావడం, సాదాసీదాగా ఉండటంతో అనుష్క పాత్రకు వచ్చినంత గుర్తింపు తమన్నాకు రాలేదు. ఎంతో కష్టపడి ఫైట్లు చేసినా కూడా బాహుబలిలో క్రెడిట్ ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కంటే తక్కువే అని చెప్పక తప్పదు.

కానీ 'సైరా' సినిమాలో మాత్రం అలా కాదు. తమన్నాకు చిరుకు మద్యన మంచి లవ్ ట్రాక్ ఉండటం, కథానాయకుడి ఆశయాల కోసం ఆమె చేసే త్యాగం, పాత్రలో నటించడానికి ఎక్కువ స్కోప్ ఉండటం, అన్నిటికీ మించి కొన్నాళ్లపాటు పాత్ర గుర్తుండిపోయేలా ఆమె నటించిన తీరు అన్నీ కలిసి తమన్నాకు కెరీర్లోనే ఇప్పటివరకు రానటువంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ ని అందుకుంది.

అంతేకాదు సినిమాలో మెగాస్టార్ తర్వాత అంత మంచి పెర్ఫార్మెన్స్ తమన్నాదే అంటున్నారు ప్రేక్షకులు. ఈ విషయం సినిమా చూసిన అందరికి అర్థమవుతుంది కూడా. ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్ కి అంత గా చెప్పుకోవడానికి ఏమీ లేదని చెప్పాలి. ఇక ఈ విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంతటి వ్యక్తే ప్రత్యేకంగా తమన్నాను పొగిడారు. మొత్తానికి మిల్కీ బ్యూటీ 'బాహుబలి' తో కాస్త నిరుత్సాహపడినా 'సైరా' తో అంతకు పదింతల ఫలితాన్ని అందుకుంది. అంతేకాదు చారిత్రక నేపథ్యం ఉన్న కథలకు అమె చక్కగా సరిపోతుందనే అభిప్రాయం దర్శక నిర్మాతల్లో ఖచ్చితంగా ఈ సినిమాతో వచ్చేసింది. ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ నుండి మెగాస్టార్ వరకు దాదాపు అందరి సరసన నటించిన క్రెడిట్ కూడా తమన్నాకే దక్కుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: