ఒకప్పటి టాలీవుడ్ అగ్రతార... ప్రస్తుత నగరి  ఎమ్మెల్యే రోజా సినిమాల్లోకి రాబోతుందని   అని తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజ... ఆ తర్వాత సినిమాల్లో కొన్ని ముఖ్య పాత్రలో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెంటే ఉంది. జబర్దస్త్ కామెడీ షో చేస్తూ జబర్దస్త్ కామెడీ షో కి సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా ఉంది రోజా . అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి జబర్దస్త్ లో ప్రవేశించి జడ్జ్  అవతారమెత్తిna రోజా..  జబర్దస్త్ లో జడ్జ్ గా నవ్వుల పువ్వులు పూయిస్తూ   ప్రజల్లో  సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది రోజా . ఆ తర్వాత వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి నగరి  ఎమ్మెల్యేగా విజయం సాధించింది రోజా .

 

 

 

 

 

 తర్వాత తాజాగా జరిగిన ఎలక్షన్లలో కూడా మరోసారి ఎమ్మెల్యే పదవి దక్కించుకుంది . అయితే ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ  జబర్దస్త్ షో ని మాత్రం వీడలేదు రోజా . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉండడంతో రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి  మాత్రం మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు.  క్యాబినెట్ హోదా ఉండే  ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే మరో రెండు సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో రోజా  చోటు దక్కించుకుంతుందని  వార్తలు కూడా వస్తున్నాయి. 

 

 

 

 

 అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. జబర్దస్త్ లో ప్రవేశించిన తర్వాత సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేసి అటు రాజకీయాలను... ఇటు జబర్దస్త్ కామెడీ షో ని బాలన్స్ చేస్తూ వస్తుంది రోజా. అయితే జబర్దస్త్ షోలో నవ్వుల పువ్వులు పూయించే  రోజా... తాజాగా సినిమాల్లోకి కూడా రాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే నటిగా ఇప్పటికే 100 సినిమాలకు పైగా నటించిన రోజా రాజకీయాల్లో ప్రవేశించడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మరి ఎన్నో ఏళ్ల తర్వాత ఓ పెద్ద హీరో సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారట రోజా . మంచి ప్రాముఖ్యం ఉన్న పాత్ర కావడంతో రోజా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: