మన సినిమా చూడాలంటే ఏం చేస్తాం దర్జాగా  సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూస్తాం. అయితే సినిమా హాల్లో ఏసీ  అన్ని ఉన్నప్పటికీ కూడా రెండున్నర గంటలు  సినిమా హాల్ లో కూర్చోవాలంటే  ఇబ్బంది పడుతూ ఉంటాం . అయితే సినిమా చూసేటప్పుడు సినిమాలో అన్నీ అందంగానే కనిపిస్తుంటాయి .... కాని  సినిమా కోసం నటులు  ఎంత కష్ట పడతారు మాత్రం ఎవరికి తెలియదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమా షూటింగ్లో పాల్గొంటారు నటీనటులు ... కొన్ని కొన్ని సార్లు సహ నటులతో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బంది ఎదురైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి. 

 

 

 

 

 

 మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించినఓ కార్యక్రమంలో  రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో రకుల్ తన పర్సనల్ లైఫ్ కి  సంబంధించి కొన్ని విషయాలు పంచుకుంది. ఓ సాంగ్లో హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అతని నుంచి వచ్చే చెమట కంపు  తట్టుకోలేక పోయాను అని చెప్పింది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని చెప్పింది రకుల్ . చివరికి ఆ హీరోకి చెప్పలేక... తానే ఫుల్లుగా పెర్ఫ్యూమ్  కొట్టుకున్నాను  అని వెల్లడించింది. అయితే రకుల్ ని చూసి సెట్ లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అదే పని చేశారట. అయితే ఈ విషయం నీకు కూడా గతంలో ఓసారి చెప్పానని రకుల్ అనడంతో మధ్యలో నన్ను లాగొద్దు అని  సరదాగా విజ్ఞప్తి చేసింది మంచు లక్ష్మి.

 

 

 

 సినిమా థియేటర్ లో ఒక్కో  సీన్ మనకి ఆహ్లాదాన్ని పంచుతుంది. కానీ  ఆ సీన్ వెనక నటులు ఎంత కష్టపడతారు అనేది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాటల్లో స్పష్టంగా అర్థమైంది. అయితే తాజాగా అందాల భామ రకుల్  టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు జోడీగా మన్మధుడు 2 నటించి మెప్పించింది. అటు బాలీవుడ్ తో కూడా సినిమాలు చేస్తున్నా రకుల్...మార్జావన్ సినిమాలో నటుస్తుంది.  అయితే ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: