బిగ్ బాస్ సీజన్ 3 మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్నడంతో టాస్కులు కూడా చాలా సీరియస్ గా సాగుతున్నాయి. అంతేకాదు ఎవరికి వారు తమ వ్యూహాలతో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. టైటిల్ పోరులో ఉండే టాప్ 3లో ఉండేందుకు అందరు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.


ఇదిలాఉంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మహేష్, రాహుల్, పునర్నవి, వరుణ్ సందేష్ లలో మహేష్ విట్టా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. ఎలిమినేషన్స్ ముందు రోజు లీక్ అవడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు కావాలని లీకులు స్ప్రెడ్ చేస్తున్నారు. తీరా టివిలో చూసి షాక్ అవుతున్నారు.


బిగ్ బాస్ సీజ 3లో క్రేజీ కంటెస్టంట్ గా మహేష్ విట్ట హౌజ్ లోకి అడుగుపెట్టాడు. ఫన్ బకెట్ అనే తెలుగు వన్ యూట్యూబ్ షో ద్వారా ఫేమస్ అయిన మహేష్ విట్ట తర్వాత సినిమాల్లో కూడా చేస్తూ వస్తున్నాడు. తనదైన కామెడీతో మెప్పించే మహేష్ హౌజ్ లో సీరియస్ గా తన ప్రయాణం మొదలు పెట్టి చిన్నగా హౌజ్ లో అందరితో కలిసిపోయాడు. ఈవారం మహేష్ నామినేషన్స్ లోకి రాగానే తానే ఎలిమినేట్ అయ్యేదని అతను కూడా డిసైడ్ అయ్యాడు.


అసలైతే ఈ వారం నామినేషన్స్ లో పునర్నవి కూడా ఉంది. ఆమె కూడా చాలా సార్లు బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యింది. అయితే పునర్నవికి తక్కువ ఓట్లు వచ్చినా మహేష్ నే ఎలిమినేట్ చేశారని అంటున్నారు. మరి అది ఎలా జరిగింది అన్నది ఆదివారం ఎపిసోడ్ లో చూడాల్సిందే. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వితిక మీద సెటైర్లు వేయడంతో పాటుగా అలి రెజాని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: