తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 75 రోజులు ముగించుకోవడం జరిగింది. ఇంకా నాలుగు వారాల ఆట ఉండటంతో ఇంటిలో వాతావరణం చాలా రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు...షాకులు చూస్తున్న వీక్షకులకు ఎంతగానో షో పై ఆసక్తిని రేపుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా జరగబోయే ఈవారం ఎలిమినేషన్ అయ్యా సభ్యులలో రాయలసీమ కుర్రోడు గా పేరు తెచ్చుకున్న మహేశ్ విట్టా ఇంటి నుండి ఎక్కువ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఎలిమినేషన్ అవ్వక ముందే ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్ని కూడా కరెక్ట్ అవడం జరిగాయి. దీంతో ఈ వారం హౌస్ నుండి మహేశ్ విట్టా ఎలిమినేట్ అవ్వడం ఖాయమని చాలామంది అంటున్నారు.


రాయలసీమ యాసలో సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ విట్టా..బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గేమింగ్ తెలివితేటలతో ఆడటం జరిగింది. షో స్టార్ట్ అయిన సందర్భంలో హౌస్ లో చాలా దూకుడుగా ఆడిన మహేశ్ విట్టా..చాలా సందర్భాలలో ఆవేశపడి నవ్వులపాలైన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బాబా భాస్కర్ మాస్టార్ కి శిష్యుడిగా మహేశ్ విట్టా  హౌస్ లో పేరు తెచ్చుకోవడం జరిగింది.


అయితే రోజులు గడిచే కొద్దీ తన ఆవేశాన్ని తగ్గించుకుంటూ హౌస్ లో సక్సెస్ ఫుల్ గా రాణించిన మహేశ్ విట్టా...ఇటీవల హౌస్ లో కొంచెం డల్ అయ్యాడట. దీంతో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లుల్లో ఇంట్రెస్ట్ లేనట్టు మహేశ్ విట్టా ఇటీవల ఎక్కువ హౌస్ లో ఆడుతున్నట్లు కనబడటంతో...మహేశ్ విట్టా ఇంటి నుండి బయటకు ఎక్కువ వెళ్లి పోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు లీక్ అవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: