దాదాపు నెల రోజుల గ్యాప్ లో  రిలీజ్ అయిన రెండు ప్యాన్ ఇండియా సినిమాల పరిస్థితి  చూస్తే టాలీవుడ్ విషాదం అర్ధమవుతుంది. నేల విడిచి సాము చేస్తూ కోట్లు మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్న ఫిల్మ్ మేకర్స్ చతికిలపడిన తీరుని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది. తెలుగు సినిమా వైభవం ఎంతో ఉంది. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. సరిగ్గా అంచనాలు ఉండడంలేదు. ఫలితాల్లో  ఒక్కసారిగా కుప్పకూలుతోంది.


సాహో ఆగస్ట్ 30న విడుదలైంది. ఆ మూవీ టాలీవుడ్ లో  డిజాస్టర్ అయింది. సాహో కలెక్షన్లు చూసుకుంటే కన్నీరు పెట్టాల్సిందే, బావురుమనాల్సిందే. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా సాహో బాలీవుడ్ జనాలకు ఎందుకో నచ్చేసింది. దాంతో వారు ఒక్కసారిగా విరగబడ్డారు. సాహో అనేశారు. బీహార్, యూపీలాంటి చోట్ల చూసుకుంటే క్యూలు కట్టారు. దాంతో వందల కోట్లు బాలీవుడ్లో సాహో రాబట్టింది.. దాంతో కొంత వరకూ సేఫ్ అయింది.


ఇక ఇపుడు సైరా సంగతి చూసుకుంటే చిరంజీవి స్టామినా వల్ల టాలీవుడ్లో కలెక్షన్లు బాగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇక్కడ మెగాస్టార్. పైగా ఆయన సినిమా మూడేళ్ళ తరువాత వచ్చింది. దాంతో వాచిపోయి ఉన్న తెలుగు జనాలకు సైరా పట్టేసింది. భారీ హంగులతో డిఫరెంట్ జోన్లో చిరంజీవి చేసిన విన్యాసానికి  ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాంతో టాలీవుడ్లో సైరా హిట్ టాక్ తెచ్చుకుంది.


ఇక బాలీవుడ్లో చూసుకుంటే మాత్రం సైరా ట్రాజెడీ స్టోరీ కనిపిస్తోంది. అక్కడ మాత్రం వార్ వీర విజ్రుంభణ చేస్తోంది. సైరా మూవీని వెనక్కి నెట్టేసింది. పైగా మెగాస్టార్ కి బాలీవుడ్ అచ్చిరాదన్న సెంటిమెంట్ మరో మారు ప్రూవ్ అయిందంటున్నారు. గతంలో ఆజ్ కా గూండారాజ్ తో పాటు మరో సినిమా చిరంజీవి చేశారు. ఆ రెందూ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  


ఇపుడు సైరా ఫట్ కావడంతో ముచ్చటగా మూడవసారి బాలీవుడ్ లో  మెగా కధ రివర్స్ అయినట్లైంది. ఏది ఏమైనా తెలుగు జనాల వరకూ చిరంజీవికి ఆదరణ ఉందని ఖైదీ నంబర్ 150 తరువాత మళ్ళీ రుజువు అయింది. దీని బట్టి చూసుకుని కొరటాల సినిమా రేంజి ఏంటో ప్లాన్ చేసుకోవడం బెటరేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: