2010వ సంవత్సరంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, తొలిసినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకోవడంతో పాటు, హీరోయిన్ గా ఆడియన్స్ నుండి సూపర్ క్రేజ్ ని సంపాదించారు. ఆ తరువాత మహేష్ ప్రక్కన దూకుడు, ఎన్టీఆర్ ప్రక్కన బృందావనం వంచి సినిమాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న ఈ చుల్ బులి, 

ఇక అక్కడినుండి వరుస అవకాశాలతో పలువురు టాలీవుడ్ మరియు కోలీవుడ్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించడం జరిగింది. ఇక తన తొలిసినిమా హీరో అయిన అక్కినేని వారబ్బాయి నాగ చైతన్యను రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే అక్టోబర్ 6న వివాహమాడిన సమంత, నేటితో చైతన్యతో కలసి తమ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ని జరుపుకుంటున్నారు. నిజానికి తొలిసినిమా సమయంలోనే తామిద్దరి మద్య ఫస్ట్ లవ్ ఏర్పడిందని, అయితే మెల్లగా అది ముదిరి పాకాన పడి, పూర్తి ప్రేమగా రూపాంతరం చెందడానికి మరికొంత సమయం పట్టిందని అన్నారు సమంత. ఇక తన జీవితంలో తల్లితండ్రుల తరువాత దేవుడు ఇచ్చిన గొప్ప వరం చైతన్య అని చెప్పే సమంత, 

తనకు ఇంతటి గొప్ప వరాన్ని ఇచ్చిన దేవుడికి ఎప్పటికీ రుణ పడి ఉంటానని ఆమె అంటుంటారు. ఇకపోతే నేడు వీరిద్దరి సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు పెద్దగా హడావుడి లేకుండా సాదాసీదాగా వారి ఇంట్లోని కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అయితే ఈ వేడుకను పురస్కరించుకుని పలువురు చై మరియు సామ్ ఫ్యాన్స్ వారిద్దరికీ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విషెస్ తెలియచేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాగచైత్య వెంకీ మామ, మరియు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోగా నటిస్తుండగా, శర్వానంద్ హీరోగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 96 మూవీ రీమేక్ లో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: