బిగ్ బాస్ సీజన్ 3 నుండి పునర్నవి భూపాలం బయటకు వచ్చేసింది. కేవలం ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 3లో రానున్న రోజుల్లో టాస్కులు మరింత టఫ్ అవ్వనున్నాయి. ఇక ఆదివారం వచ్చింది అంటే ఎలిమినేషన్ జరగాల్సిందే. ఈ వారం నామినేషన్స్ లో వరుణ్ సందేష్, మహేష్, రాహుల్, పునర్నవి ఉండగా ఫైనల్ గా పునర్నవి ఎలిమినేట్ అయ్యింది.


హౌజ్ లో రాహుల్ తో మంచి రిలేషన్ ఏర్పరచుకున్న పునర్నవి తనతో దాదాపు పర్సనల్ రిలేషన్ వరకు వెళ్లిందని చెప్పొచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో మహేష్, పునర్నవిలలో ఇకరు బయటకు వెళ్తారని ముందే తెలిసిపోయింది. ఎందుకంటే వీరిద్దరితో పోల్చుకుంటే రాహుల్, వరుణ్ స్ట్రాంగ్ గా ఉన్నారు.


ఇక హౌజ్ నుండి పునర్నవి ఎలిమినేట్ అవడం రాహుల్, వితిక, వరుణ్ లకు కొద్దిగా బాధ కలిగిస్తుంది. అయితే టాస్కుల్లో పునర్నవి కొద్దిగా వెనుకపడటం కేవలం వరుణ్, వితిక, రాహుల్ లతోనే ఆమె గేం ఆడటం.. మాట్లాడటం లాంటి విషయాలు ఆడియెన్స్ కు నచ్చలేదు. అందుకే ఆమెను ఎలిమినేట్ చేశారు.


అసలైతే ఈ వారం ఎలిమినేషన్స్ లో మహేష్ బయటకు వస్తారని అందరు అన్నారు. కాని చివరి నిమిషంలో బిగ్ బాస్ డెశిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. హీరోయిన్ గా పునర్నవి ఇంతకుముందు పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోయినా బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఆమెకు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. తను చెప్పాలనుకున్న పాయింట్ ఎలాంటి మొహమాట లేకుండా చెప్పే పునర్నవి ఇంటి నుండి బయటకు వెళ్లడం రాహుల్, వితిక, వరుణ్ లకు చెయ్యి విరిగినంత పని అయ్యింది. ఈ సీజన్ లో టాప్ 5 లో శ్రీముఖి, వరుణ్, రాహుల్, శివ జ్యోతి, బాబా భాస్కర్ ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: