మెగా హీరో సాయి ధరం తేజ్ చిత్రలహరి నుండి సాయి తేజ్ గా తన పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేని సాయి తేజ్ చిత్రలహరితో సక్సెస్ అందుకోగా.. ప్రస్తుతం సాయి తేజ్ మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడు.


ఆ సినిమా టైటిల్ సోలో బ్రతుకే సో బెటర్ అని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాదాపుగా టైటిల్ తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది తెలుస్తుంది. ప్రస్తుతం మెగా హీరోలతో అతని పరిస్థితి కూడా సోలోగా మారిందని చెప్పినట్టే ఉంది. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


అభిరుచి గల నిర్మాతగా ప్రతి సినిమా ఎంతో స్పెషల్ గా ఉండేలా చూసుకునే బోగవల్లి ప్రసాద్ సాయి తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ కు హెల్ప్ అయ్యేలా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.  


వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాక కెరియర్ లో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. చిత్రలహరితో హిట్ అనిపించుకున్నా కెరియర్ లో మరో స్ట్రాంగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు సాయి తేజ్. ఆ హిట్టు సినిమా ప్రతిరోజు పండుగే అవుతుందా లేక సోలో బ్రతుకే సో బెటర్ అవుతుందా అన్నది చూడాలి. ఈ రెండు సినిమాలతో సాయి తేజ్ సత్తా చాటాలని చూస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: