తెలుగు కామెడీ షో లో అత్యధిక ఆదరణ పొందిన షో జబర్దస్త్ షో. తెలుగు టెలివిజన్ రంగంలోనే రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధిస్తూ మంచి పాపులారిటీ ఈ షో కి దక్కింది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్విస్తు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్. ముఖ్యంగా జబర్దస్త్ షోలో యాంకర్ రేష్మి తో పంచులు వేస్తూ అలరిస్తూ తమ మధ్య ఏదో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ సుడిగాలి సుదీర్ తన కెరీర్ ని చాలా తెలివిగా బిల్డప్ చేసుకున్నారు. ఈటీవీలో జబర్దస్త్ షో మరియు డీ షో లో యాంకర్ రేష్మి సుధీర్ హైలెట్ గా అదిరిపోయే రీతిలో రాణిస్తున్నారు. దీంతో తెలుగు టెలివిజన్ రంగంలో హిట్ పెయిర్ అని వీరిద్దరికీ టైటిల్ దక్కింది.


దీంతో సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు కుప్పలుతెప్పలుగా ప్రస్తుతం వస్తున్న నేపథ్యంలో ...ఇటీవల సుడిగాలి సుదీర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని తన పై రష్మీ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం జరిగింది. సుడిగాలి సుధీర్ ఏం చెప్పాడంటే..తను లవ్ ఫెయిల్యూర్ అని, అందుకే అమ్మాయిలంటే నచ్చదంటూ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.'జబర్దస్త్' షోకి రాకముందు సుడిగాలి సుధీర్ ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఐదవ తరగతి నుండే ఆమె అంటే సుధీర్ కి ఇష్టమట. తొమ్మిదో తరగతిలో ఆమెకి  విషయాన్ని చెబితే తన లవ్ ని యాక్సెప్ట్ చేసిందని.. కొన్నాళ్లపాటు తమ ప్రేమ బాగానే సాగిందని చెప్పాడు సుధీర్.


అయితే సడెన్ గా తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకడిని లవ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పుకొచ్చాడు సుధీర్. నేను ఫిలిం నగర్ కి అవకాశాల కోసం వచ్చిన సమయంలో ఆమె తన క్లాస్ మేట్ ని ప్రేమించడం మొదలుపెట్టిందని.. ఈ విషయం తనకు తెలిసినా నమ్మలేదని సుధీర్ తెలిపారు. పన్నెండేళ్లు ప్రేమించిన అమ్మాయి అలా చేయదనుకున్నానని.. కానీ సడెన్ గా తనకు హ్యాండ్ ఇచ్చి వేరేవాడ్ని పెళ్లి చేసుకుందని అప్పటినుండి అమ్మాయిల జోలికి వెళ్ళటం మానేశానని సుడిగాలి సుదీర్ తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: