మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన  మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలైనది . అయితే విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కూడా బాగానే రాబడుతుంది.అన్ని  ఇండస్ట్రీ లలో కంటే తెలుగులో సత్తాచాటుతుంది  సైరా నరసింహారెడ్డి సినిమా. 

 

 

 

 5 రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టింది  సైరా  నరసింహారెడ్డి సినిమా. ఐదు రోజుల్లోనే  మంచి వసూళ్లు సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల మార్కును అందుకుంది . దసరా సెలవులు కూడా కలిసిరావడంతో సైరా కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సైరా తన హవా నడుపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 19.30 కోట్లు రాబట్టిన  సైరా నరసింహారెడ్డి... ఇక ఆంధ్రప్రదేశ్లో 50 కోట్ల  కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది. దసరా సెలవుల నేపథ్యంలో సైరా సినిమా చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

 

 

 

 అయితే తెలుగు రాష్ట్రాల్లో కన్నడలో కూడా సైరా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. కానీ తమిళ్ లో హిందీలో కూడా ఆశించిన స్థాయిలో మాత్రం సైరా  వసూళ్లు  రాబట్టలేకపోయింది. అయితే ఈ  సినిమా 170 కోట్లు షేర్  దాటితే కానీ  అనిపించుకోదు . కాగా ఒక తెలుగు కన్నడ లో తప్ప చిరంజీవికి మరే భాషలోనూ సైరా అంతగా కలిసి రాలేదు. కాగా  ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా  కలిపి గ్రాస్  160 కోట్లుగా ఉంది. అయితే ఇంకా ఎంత వరకు సైరా నరసింహ రెడ్డి  సినిమా వసూళ్ళు రాబడుతుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: