ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ తో సమానంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  త్వరలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ తమ్ముడి కెరియర్ సెట్ చేసే పనిలో పడ్డాడు.  

 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెరంగేట్రం చేశాడు.  ఆ మూవీలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఒక మూవీ చేస్తున్నాడు ఆనంద్.  ఈ సినిమాతో పాటుగా మరో మూవీ లైన్ లో పెట్టాడట. 

 

షార్ట్ ఫిల్మ్ మేకర్ దామోదర్ అత్తాడ డైరెక్షన్ లో ఆనంద్ సినిమా ఓకే అయ్యిందట.  ఈ మూవీని  విజయ్,  ప్రదీప్ కలిసి నిర్మిస్తారని తెలుస్తుంది. దసరా సందర్బంగా ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ జరిగింది.  

 

యూనిక్ స్టొరీ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. విజయ్ క్రేజీ ఫాన్స్ ఎలాగూ ఆనంద్ ను ఇష్టపడతారు కాబట్టి ఈ మూవీ కన్ఫార్మ్ గా ఆనంద్ కు మంచి హిట్ ఇస్తుందని అంటున్నారు.  ఒక సినిమా పూర్తి కాకుండానే మరో మూవీ లైన్ లో పెడుతూ తన స్పీడ్ తో షాక్ ఇస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. 

మరింత సమాచారం తెలుసుకోండి: