మెగా ప్రిన్స్ స్టైలీష్ గ్రీకు వీరుడిగా మారిపోయాడు. గద్దల కొండ గణేష్ గా ఊరమాస్ పర్ఫామెన్స్ తో విజిల్స్ వేయించిన వరుణ్ తేజ్ అల్ట్రా మోడ్రన్ లుక్ తో మాయ చేస్తున్నాడు. ఈ మెగా హీరో మేకోవర్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. 


బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో వరుణ్ తేజ్ కెరీర్ మంచి స్వీంగ్ లో ఉంది. ఈ ఏడాది ఎఫ్ 2తో మొదటి హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ రీసెంట్ గా వాల్మీకీతో ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేశాడు. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ చేసిన ఊరమాస్ యాక్టింగ్ కు ఆడియన్స్ తో పాటు క్రికిట్స్ కూడా ప్రశంసలు కురిపించారు. క్లాస్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఫస్ట్ టైం వాల్మీకీలో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో ట్రెమండస్ పర్ఫామెన్స్ తో ప్లాన్ చేశాడు. 


వాల్మీకి సినిమాలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో వరుణ్ తేజ్ చేసిన మేకోవర్ ఆడియన్స్ కు సరికొత్త కిక్ ఇచ్చింది. ఇపుడు అందుకు భిన్నంగా క్లాస్ టచ్ తో గ్రీకు వీరుడిలా మెగా ప్రిన్స్ చేసిన ఫోటో షూట్ ఇండస్ట్రీ సర్కిల్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ప్రఖ్యాత  ప్రోవోక్ కవర్ పేజీపై వరుణ్ తేజ్ ఇచ్చిన ఫోజు సింప్లీ సూపర్బ్ గా ఉంది. 


గద్దల కొండ గణేష్ గా రగ్గడ్ లుక్ లో క్రూరత్వం ప్రదర్శించిన వరుణ్ తేజ్ వెంటనే ఇలా స్టైలీష్ లుక్ లో కనిపించడంతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో వరుణ్ తేజ్ ఒకడు. రీసెంట్ గా వాల్మీకి బ్రేక్ ఈవెంట్ దాటేసి బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: