సౌత్ సూపర్ స్టార్ ఈ సారి గట్టిగా కొట్టబోతున్నాడా?  ప్రయోగాలతో నిరాశపరిచిన రజినీకాంత్ పక్కా కమర్షియల్ మూవీతో రికార్డ్ తిరగరాస్తాడా?  ప్యాకప్ చెప్పిన సౌత్ స్టార్ పొంగల్ కు బాక్సాఫీసును చేయబోతున్నాడా? 


డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ తో రజినీకాంత్ మ్యానియా బాగా తగ్గిపోయింది. శివాజీ, రోబో సినిమాలతో ఆల్ ఓవర్ ఇండియాను షేక్ చేసిన సౌత్ స్టార్ తొమ్మిదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. రోబో సీక్వెల్ తో రోబో మ్యాజిక్ రిపీట్ చేయాలనుకున్న రజినీకి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ప్రయోగాత్మక కమర్షియల్ మూవీస్ కబాలి, కాలా సినిమాలకు ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయినా ఫలితం మాత్రం తేడా కొట్టింది. దీంతో రజినీకాంత్ ఈ సారి తనదైన కమర్షియల్ మూవీతో బాక్సాఫీస్ షేక్  చేసేందుకు రెడీ అవుతున్నాడు. 


ఈ ఏడాది పేటా సినిమాతో రజినీకాంత్ ఓ మోస్తరు విజయం అందుకున్నాడు. ప్రస్తుతం సౌత్ సూపర్ స్టార్, మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ మూవీ చేస్తున్నాడు. రజినీకాంత్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. చాలా కాలం తర్వాత రజినీకాంత్ దర్బార్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రజినీ పోలీస్ గెటప్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి తోడు మురుగదాస్ సౌత్ స్టార్ ను చాలా యంగ్ గా ప్రొజెక్ట్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. 


దర్బార్ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న దర్బార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దర్బాస్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాతి సిీజన్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎక్స్ పెరిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాతో అయినా రజినీకాంత్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: