అక్కినేని ఇంటి కోడలు సమంత రూత్ ప్రభు చాలా మోడరన్. ఇదివరకే పెళ్లయిన తర్వాత ఆమె వేసుకున్న దుస్తులపై చాలామంది అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ తను మాత్రం అవేమీ పట్టించుకోకుండా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సాగిపోయింది. అభ్యంతరాలు మరీ ఎక్కువైనప్పుడు వాళ్లకు చెంపపెట్టులాంటిది సమాధానాలు కూడా ఇవ్వడం కామనే. అలాంటిది ఏదో వివాదం చెలరేగిన తర్వాత కాస్త డోస్ పెంచి ఫోటో షూట్లు కూడా ఇచ్చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఇదంతా ఎప్పుడూ ఉండే గోల అయినా ఇప్పుడు తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా పెట్టిన ఒక ఫోటో 'అంతకుమించి' అన్నట్లు ఉంది.

సాధారణంగా జంతు ప్రేమికులు అయిన సమంత ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే తన ఇంట్లో ఎప్పుడూ ఉండే కుక్క నో లేకపోతే ఇది ఏమైనా కొత్తగా వచ్చిందో తెలియదు గానీ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్టు ద్వారా చాలా విచిత్రమైన ఫోటో పెట్టింది. ఆ ఫోటోలో కుక్క మెడలో 'నెం 1 హస్బండ్' అనే ట్యాగ్ ఉంది. అయితే కుక్కను సమంత ప్రేమగా బుగబూ అని పిలుచుచుకుంటుంది. అయితే అసలైన విషయం అది కాదు ఈ ఫోటో చూసి చైతు ఫ్యాన్స్ మాత్రం భారీగా హర్ట్ అయ్యారు.

ఒక కుక్క కు 'నెంబర్ వన్ హస్బెండ్' అనే ట్యాగ్ వేసి ఆ ఫోటో ని ఇలా పోస్ట్ చేయడం చూస్తే ఇది నాగచైతన్యను తక్కువ చేసినట్లుగా అందరికీ అర్థం అవుతుందని... కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టడం మానుకోవాలని అని ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. కొంతమంది అయితే ఇది పురుషులందరినీ తక్కువ చేయడమేనని సేమ్ ఇలాగే ఇదే ట్యాగ్ రివర్స్ లో 'నెంబర్ వన్ వైఫ్' అని కట్టి ఉంటే ఈపాటికి ఎంత రచ్చ జరిగి ఉండేదో ఆలోచించాలని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ విషయం అంతా సమంత పట్టించుకుంటుందా లేదా మొత్తం సద్దుమణిగేలోగా వాళ్లందరికీ కోసం ఇంకొక పోస్ట్ పెట్టి వారి ఉద్రేకాన్ని మరింత పెంచుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: