"జార్జ్ రెడ్డి"...దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లో నే హత్య చేశారు..  నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్.


ఎందరో  విద్యార్తులను కదిలించిన వ్యక్తి,  అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్  రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు..ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ సినిమా బయోపిక్ అయినా..ట్రైలర్ చూస్తుంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో నే చెప్పారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ రీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.


మొత్తంగా ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ టీమ్ ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇటీవల "నాల్" సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.


సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీని, ఇటీవల మరాఠి బ్లాక్ బస్టర్  ‘‘నాల్’’ కు దర్శకత్వం వహించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు."నాల్" సినిమాకు గాను ఆయనకు డెబ్యూ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు రావటం విశేషం. 


"జార్జిరెడ్డి "చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. సంజయ్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా, దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటిలు అసోసియేటెడ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: