మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా రిలీజై విజయవంతం గా ప్రదర్శింపబడుతోంది. ఇక ఈ ఉత్సాహంతో చిరు తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయారు. అయితే ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీశ్రీ ప్రసాద్ కు డైరక్టర్ కొరటాల శివ తో పాటు మెగాస్టార్ కూడ గుడ్ బై చెప్పేసారని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఇప్పటి వరకు కొరటాల-దేవీశ్రీ ఇద్దరు కలిసి నాలుగు బ్లాక్ బస్టర్లకు పని చేసారు. అన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ అన్న విషయం తెలిసిందే. కానీ తొలిసారిగా కొరటాల శివ ఓ హిందీ మ్యూజిక్ డైరక్టర్ తో పని చేయబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్.

విజయ దశమి సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగాస్టార్ 152వ సినిమా వివరాల్లో మ్యూజిక్ డైరక్టర్ పేరు లేదు. దీనికి కారణం ప్రత్యేకంగా ఏమీలేదని టాక్. అయితే కొరటాల ఈసారి మాత్రం వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నారట. అయితే కొరటాల మాత్రమే అనుకుంటున్నారా? లేక మెగాస్టార్ కూడా అనుకుంటున్నారా? అన్నది సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ మెగాస్టార్ కు, రామ్ చరణ్ కు దేవీ తో చేయడం ఇష్టమైతే కొరటాల కాదని అనలేడు.
ఖైదీ 150 సినిమా సక్సస్ లో దేవీశ్రీ ప్రసాద్ పాత్ర చాలా కీలకం. కానీ సైరా సినిమాకు మాత్రం ఎందుకనో దేవీ ని తీసుకోలేదు. ఒకవేళ భారీ సినిమా, పాన్ ఇండియా సినిమా కాబట్టి దేవీ ని తీసుకోలేదనుకున్న ఇప్పుడు ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు కూడా తీసుకోవడం లేదంటే, మెగా కాంపౌండ్ కూడా దేవీశ్రీ ప్రసాద్ ను దూరం పెడుతోందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా ఎందుకు అన్న క్లారిటి మాత్రం లేదు.

వాస్తవంగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు దేవీ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్  అజ్ఞాతవాసికి దేవీ పనిచేయలేదు. ఆ తరువాత నుంచి త్రివిక్రమ్ అనిరుధ్, థమన్, మిక్కీ లాంటి వాళ్లతో పని చేస్తున్నారు. మొత్తంమీద దేవీ ఇన్నింగ్స్ తెలుగులో మెల్లగా తగ్గుతోందని అర్థం అవుతోంది. మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత దేవీ మీద ఇండస్ట్రీలో అందరికి ఇంట్రస్ట్ తగ్గిందన్న మాట మాత్రం వాస్తం అని ఒప్పుకోక తప్పదు.     


మరింత సమాచారం తెలుసుకోండి: