ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR. అయితే సినిమా మొదలు పెట్టిన నాటి నుండి సినిమా షూటింగ్ కి ఏదో ఒక రూపంలో అడ్డంకులు ఎక్కువైన నేపథ్యంలో వరుసగా రాంచరణ్ కి మరియు ఎన్టీఆర్ కి షూటింగ్ సమయంలో గాయాలు కావడంతో  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అనుకున్న టైం కి కంప్లీట్ చేయడం కష్టమని కామెంట్లు రావడంతో డైరెక్టర్ రాజమౌళి...సినిమా నీ త్వరగా కంప్లీట్ చేయడానికి పకడ్బందీ షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే మరోపక్క రామ్ చరణ్ నిర్మాతగా నిర్మించిన సైరా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మునిగిపోయి...రాజమౌళి సినిమా షూటింగ్ కి డుమ్మా కొడుతున్న నేపద్యంలో...రాజమౌళి..చెర్రీ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


'సైరా' ప్రమోషన్ కార్యక్రమాలలో మునిగిపోయి..రాత్రి పగలు తెగ కష్టపడుతున్న తరుణంలో రామ్ చరణ్ లో ఉండే గ్లో తగ్గిందట. దీంతో ఇలాగే వ్యవహరిస్తే కష్టమని రాజమౌళి రామ్ చరణ్ కి తెలిపారట. అంతేకాకుండా నువ్వు వెంటనే షూటింగ్ కు రావాలి..అలాగే ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ముఖంలో తేడా తెచ్చుకోనేలా ఉండవద్దు అని చెప్పారట. తన హీరో హెల్త్, లుక్ తనకు ముఖ్యం అని చెప్పారట.


అలాగే రిలీజ్ అయ్యిపోయింది కాబట్టి మిగతా ఫార్మాలిటీస్ క్రింద వాళ్లకు అప్పచెప్పి నిర్మాతగా రిలీవ్ అయ్యి షూటింగ్ కు ప్రిపేర్ అవ్వమని చెప్పారట. ఇంక లేటు చేయటానికి వీళ్లేదని, హీరోలకు దెబ్బలతో ఇప్పటికే సినిమా లేటు మోడ్ లో వెళ్తోందని, ఇలా అయితే అనుకున్న తేదీకి రిలీజ్ కష్టమని చెప్పారట. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా..సైరా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మిగతా పనులను వేరే వాళ్లకు అప్పజెప్పి...RRR సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం జులై మాసమున ఈ సినిమా విడుదల చేస్తున్నారని ముందే ప్రకటించడంతో రాజమౌళి..అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందో లేదో అన్న టెన్షన్ లో ప్రస్తుతం ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: