సౌత్‌ క్వీన్‌ నయన్‌తార ప్రేమ లీలలు ఎప్పుడూ ఇండస్ట్రీ హాట్‌ టాపిక్కే. తాజాగా ఆమె తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు అప్పుడ్పుపూ నెట్టింట్లో వైరల్‌ అవుతుండడం కామనే. తాజాగా ఆమె విఘ్నేశ్‌ను పెళ్లి చేసుకునే వార్త ఒక‌టి వైర‌ల్ అవుతోంది.


విఘ్నేష్ తనకు కాబోయే భర్త అని ఓ వేదికపై నయన్ ప్రకటించేశారు కూడా. ఇద్దరూ తరచూ విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడి ఫొటోలను విఘ్నేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయన్ ఘనంగా పార్టీ కూడా ఏర్పాటుచేశారు. కాగా.. ఇప్పుడు వీరిద్దరూ తమ ప్రేమను మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారట.


వీరిద్ద‌రి ప్రేమ ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పైగా, వీరి వివాహం ఇండియాలో కాకుండా విదేశాల్లో జరుగుతుందని, అతికొద్ది మంది మాత్రమే దీనికి హాజరవుతారని కోలీవుడ్ సమాచారం. ఇండియాలో అయితే అభిమానులు, మీడియా వర్గాల వల్ల ప్రైవసీ ఉండదని డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారట. 


న‌టి నయన్‌తార‌, విగ్నేశ్‌లు నల్ల టోపీలు పెట్టుకుని దిగిన ఫొటోను విగ్నేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..హే..నాకు పెళ్లి వయసు వచ్చింది. నీకోసం ఎదురుచూడనా అని తమిళంలో క్యాప్షన్‌ ఇచ్చారు. నిజానికి ఈ పదాలు నయన్‌ నటిస్తున్న సినిమాలోని ఓ పాటలోనివి. ఆమె ‘కొలమావు కోకిల’ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ‘కల్యాణ వయసు..’ అనే పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలోని లిరిక్స్‌ను పోస్ట్‌ చేస్తూ విగ్నేశ్‌ పై విధంగా ట్వీట్‌ చేశారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో ఇద్దరూ ఓ ఇంటివారయ్యేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: