గత కొద్ది రోజులుగా బాలీవుడ్లో ఓ జంట గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఆ జంట విడిపోవడానికి సిద్ధం కావడమే అన్ని చర్చలకు దారితీసింది. ఆ జంట ఎవరో కాదు... అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్చర్. అనురాగ్, కల్కిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ముచ్చటగా కనిపించేవారు. అయితే కొన్ని రోజుల క్రితం టూరుకు పోయిన కల్కి మరో వ్యక్తితో కనిపించింది. ఎవరా అని ఆరా తీస్తే, అతడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ అని తెలిసింది. ఇదేంది మీ ఆవిడ ఇలా చేస్తోంది అని అనురాగ్ ని అడిగితే... మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు. తను ఎవరితో తిరిగినా తనకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు. అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా అయిపోయిందేమిటి అని వారి సన్నిహితులు చాలా బాధపడ్డారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తానికి కారణం ఓ హీరోయిన్ అని అంటున్నారు. ఆమె ఎవరో తెలుసా? బాలయ్యతో లెజెండ్ చిత్రంలో నటిస్తోన్న రాధిక ఆప్టే. ఈ ఇద్దరూ గతంలో కలసి పని చేశారట. అప్పుడే లవ్ పుట్టిందట. అప్పటికే తనకు కల్కితో పెళ్లై చాలా కాలమైనా, రాధికతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట అనురాగ్. ఆ విషయం కల్కికి తెలియడం వల్లే వాళ్ల మధ్య గొడవలు వచ్చాయని అంటున్నారు. పోనీ ఇది రూమర్ అని కొట్టి పారేద్దామంటే, కళ్లముందు కొన్ని సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి. వీరందరి కామెంట్లకూ బలాన్ని చేకూర్చే వార్త ఒకటి తెలిసింది. అదేమిటంటే... రాధిక ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయడానికి అనురాగ్ సన్నాహాలు చేస్తున్నాడు. లెజెండ్ చిత్రం అవగానే అది మొదలవుతుందట. ఇంకేమి... కథ కంచికి, రాధిక అనురాగ్ దగ్గరికి!

మరింత సమాచారం తెలుసుకోండి: