ఈ మద్య కాలంలో టెలివిజన్ రంగంలో యాంకర్లుగా వచ్చిన వారు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ..లక్కీగా హీరోయిన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మిలు హీరోయిన్లు గా కూడా నటించారు. తాజాగా వీరి బాటలోనే నడుస్తుంది యాంకర్ అనసూయ. అదుర్స్ అనే కార్యక్రమంతో యాంకర్ గా పరిచయం అయ్యింది శ్రీముఖి. 2012 లో
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్
శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది.
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీముఖి బుల్లితెరపై ‘పటాస్’ కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యింది. ‘పటాస్ ’ లో రాములమ్మగా శ్రీముఖి కి మంచి పెరు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోలో గట్టి పోటీని ఇస్తూ
గేమ్ ఆడుతున్న
శ్రీ ముఖి హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్ ఇవిఎస్ దర్శకత్వంలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్టైల్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీలో శ్రీముఖి లేడీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించబోతుందట.
డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ లేడి ఓరియెంటెడ్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా
దసరా సందర్బంగా సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
శ్రీ ముఖి గన్ పట్టుకొని డిఫరెంట్ గా కనిపించింది. ఫైర్ ని పట్టుకోగలరా? అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరి బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ తో వెండితెరపై శ్రీముఖి రాణిస్తుందా లేదా చూడాలి.