బిగ్ బాస్ 3 హౌస్ లోని కంటెస్టెంట్ అందరిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది యాంకర్ శ్రీముఖి. మంచి స్ట్రాటజీస్ ... 100% ఎఫర్ట్ తో ఏ టాస్క్ ఇచ్చిన దుమ్మురేపుతూ అందరినీ ఆకర్షిస్తుంది శ్రీముఖి. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ గట్టిపోటీ ఇస్తూ దూసుకుపోతుంది. తనదైన స్టైల్లో బిగ్ బాస్ 3 హౌస్లో కంటెస్టెంట్స్ కి పోటీ నిస్తూ రోజురోజుకూ క్రేజ్ ను పెంచుకుంటుంది శ్రీముఖి. టా స్కుల విషయంలో అయినా పర్ఫామెన్స్ లో అయినా ... దుమ్ము రేపుతుంది శ్రీముఖి. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రతీ నామినేషన్ లో ఉంటూ కూడా ప్రతిసారి సేవ్ అవుతుంది శ్రీముఖి.
శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగటంతో ఫ్యాన్ పేజీలు ఆర్మీ లు కూడా పుట్టుకొచ్చాయి . ఈ నేపథ్యంలో శ్రీముఖి ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదెలా అంటే తాజాగా అక్టోబర్ 2 న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచటంతో సినిమా థియేటర్లకు క్యూ కట్టి మరీ సినిమాను వీక్షిస్తున్నారు ప్రేక్షకులు .ఇక సైరా సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లలో శ్రీముఖి ఫ్రాన్స్ శ్రీముఖి సంబంధించిన యాడ్ లను ప్లే చేస్తున్నారు. శ్రీముఖికి మద్దతుగా ఓటు వేసి శ్రీముఖిని బిగ్ బాస్3 విన్నర్ గా మార్చాలంటు ... మెగా అభిమానులను ఆకట్టుకునే పనిలో పడ్డారు శ్రీముఖి ఫాన్స్ .
ఇలా చేయడం వల్ల మెగా అభిమానుల్లో శ్రీముఖి ఓటు వేయాలనే ఆలోచన రేకెత్తించి శ్రీముఖి ఓటు వేసి మద్దతు ఇవ్వటం వల్ల బిగ్ బాస్ 3 విన్నర్ గా శ్రీముఖి మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక శ్రీముఖి నామినేషన్ లో ఉన్నప్పుడల్లా ఫాన్స్ భారీ మొత్తంలో శ్రీముఖికి సపోర్ట్ చేయడంతో... ఎన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చినప్పటికి శ్రీముఖి మాత్రం శ్రీముఖి మాత్రం సేవ్ అవుతుంది . అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మంచి ప్రణాళికలు వ్యూహలతో ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇస్తూ ప్రేక్షకులందరికీ ఫేవరేట్ కంటెస్టెంట్ గా మారిపోతుంది శ్రీముఖి.