తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఎంతో పాపులారిటీ ఉన్న ఈ షో గత కొద్ది రోజులుగా చాలా చప్పగా సాగుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు డబల్ గేమ్ ఆడుతూ సేఫ్ గా సాగిస్తున్నారు. ప్రోమో చూసి ఎపిసోడ్ చూసిన వారందరూ నిరాశకి లోనవుతున్నారు. ప్రోమో చూపించినంత దమ్ము ఎపిసోడ్ లో లేకపోవడంతో ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. ఈ మేరకు బిగ్ బాస్ షో మేడిపండులా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.


గురువారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. ప్రోమో చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు మంచి ఎపిసోడ్ చూడబోతున్నామని ఆశగా వెయిట్ చేశారు. కానీ ప్రోమో లో చూపించినంత దమ్ము ఎపిసోడ్ లో లేకపోవడంతో ప్రేక్షకులే  మరోసారి మోసపోయారు. ఇతర కంటెస్టెంట్లు తమ గురించి ఏమనుకుంటున్నారో వీడియో చూపిస్తే వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుందని బిగ్ బాస్ ఆశించాడు.


కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతా జరిగాక ఆల్ ఈజ్ ఫైన్ అంటూ ఒకరినొకరు హగ్ చేసుకొని కలిసిపోవడం విచిత్రంగా అనిపించింది. బిగ్ బాస్ లో కలవడం వల్ల ఫన్ జనరేట్ అవదు. గొడవలు పడితేనే జనాలు ఆనందిస్తారు. ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ కంటెస్టెంట్లు మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరీ అంతలా సేఫ్ గేమ్ ఆడడం వల్ల ప్రేక్షకుల్లో బిగ్ బాస్ చూడాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది.


కంటెస్టెంట్లు పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే జనాల్ని ఎంటర్ టైన్ చేయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. బిగ్ బాస్ ఫైనల్ దగ్గర పడుతున్న కూడా కంటెస్టెంట ఎవరిలో కూడా ఫైర్ కనిపించట్లేదు. మరి ఆ ఫైర్ కనబడేలా బిగ్ బాస్ ఎలాంటి ప్లాన్ వేస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: