తెలుగు లో వస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యింది నటి రష్మీ గౌతమ్.  కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మీకి పెద్దగా గుర్తింపు రాలేదు.  ఇక జబర్దస్త్ కామెడీ షోతో పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు ఇతర ఛానల్స్ లో యాంకర్ గా ఛాన్సులు రావడం..అదే సమయంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించడం..ఇలా వరుస బిజీ షెడ్యూల్స్ తో జబర్దస్త్ కొంత కాలం పాటు దూరమైంది. ఆమె స్థానంలో ఎంట్రీ ఇచ్చింది రష్మీ గౌతమ్.  


జబర్దస్త్ లో తన వచ్చీరాని తెలుగు తో హాట్ లుక్ తో అలరించింది రష్మీ.  జబర్దస్త్ పుణ్యమా అని రష్మీ కి కూడా తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ లో వరుసగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఈ హాట్ బ్యూటీ.  సినిమాల్లో తన  అందాలను కనువిందు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కాకపోతే రష్మీ నటించిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ కాకపోయినా..ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  


ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' సినిమాలో రెచ్చిపోయి నటించింది.  ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటే రష్మీ అడపా దడపా హాట్ లుక్స్ తో ఫోటో షూట్స్ అప్ లోడ్ చేస్తుంది. తాజాగా రష్మీ చీరకట్టుతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఓ పిక్ అప్ లోడ్ చేసింది..ఇంకేముంది ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: