తెలుగు ఇండస్ట్రీలో జక్కన్న గా పేరు తెచ్చుకున్న దర్శకుడ రాజమౌళి. బాహుబలి ద్వారా అతడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాని ఆకాశాన నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. మరి ఈ దర్శకుడు తన తర్వాతి చిత్రమైనా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.


రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేయాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది. అలాగే ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన హీరోయిన్లుగా నటించే వారు కూడా అనుకున్నారు. అయితే రామ్ చరణ్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తుంది. ఈమెపై కొంత చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జోడో కోసం రాజమౌళి తెగ వెతుకుతున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.


గతంలో బ్రిటిష్ హీరోయిన్ ఎడ్గర్ డేసి ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఐతే కారణాలేమైనా ఆమె ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్లు కావడంతో వారిలో ఒకరిని బాలీవుడ్ హీరోయిన్ ఒకరిని ఎంపిక చేశారని సమాచారం.ఆటవిక తెగకు చెందిన అమ్మాయి పాత్రకు గాను, బాలీవుడ్ భామతో చర్చలు జరిపి ఒకే చేశారట. ఆమె ఎవరో త్వరలోనే ప్రకటిస్తారట.


ఇక బ్రిటిష్ లేడీ పాత్ర కోసం మరో హాలీవుడ్ నటిని తీసుకోవాల్సివుంది. అయితే ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలో తెలియట్లేదట. వచ్చే సంవత్సరం అర్థ భాగంలో సినిమా విడుదల ఉంటుందని ప్రకటించిన రాజమౌళి ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయించకపోవడంతో అటు ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన అధికమైంది. మరి ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ ఎప్పుడిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

rrr