దర్శక, నిర్మాతలు- రచయితలతో పాటు హీరో కూడా సినిమా ఎడిటింగ్ లో ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంటారు. హీరో దర్శక నిర్మాతలతో పాటుగా స్క్రిప్టు డిస్కషన్ లోను ఇన్వాల్వ్ అవుతు ఉంటారు. స్క్రిప్టు మొత్తం విని అందులో తనకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్పే హక్కు అందులో నటించే హీరోకి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా హీరో కథలో ఇన్వాల్ అవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఒకవేళ కథ బాగా లేకపోతే తన కెరీలో ఒక ఫ్లాప్ పడుతుంది..రెండవది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవడంతో పాటు తన మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. 

అందుకే మన స్టార్ హీరోలు స్క్రిప్టు దశలోనే ఇటీవల ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. మారిన ట్రెండ్ లో సినిమాని ఏదో ఒకలా చుట్టేసి రిలీజ్ చేసేస్తామంటే కుదరడం లేదు. స్క్రిప్టు బావుండాలి. ఎమోషన్ కుదరాలి. ప్రతి సన్నివేశం తెరకెక్కక ముందే అది ఎలా ఉందో ఊహించుకోవాలి. అలా ఇమాజిన్ చేసినది తెరపై యాజిటీజ్ గా రావాలి. లేదా ఇంకా బాగా రావాలి. బాగా లేదంటే ప్రేక్షకులు నిర్ధాక్షణంగా తిరస్కరిస్తున్నారు. అయితే ఇలాంటి విషయంలోనే బన్ని ఎక్కువ శ్రద్ధ చూపించడాన్ని వేరే భావిస్తున్నారు కొందరు సినిమావాళ్ళు.

సుకుమార్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న సినిమాకి స్క్రిప్టు రెడీ అవుతోంది. అయితే ఫైనల్ వెర్షన్ విన్న తర్వాత అందులో సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మార్చాలని బన్ని సూచించారట. దాంతో సుక్కూ మరో వెర్షన్ రాస్తున్నారు అంటూ ప్రచారమవుతోంది. అయితే ఇందులో నిజంలేదని తెలుస్తోంది. వాస్తవంగా బన్ని స్క్రిప్టు విషయంలో వేలు పెట్టలేదని తెలుస్తోంది. సుకుమార్ కి స్క్రిప్ట్ ఇలా రాయి.. ఆ సిన్ ని ఇలా మార్చు అంటూ ఆయన సూచించింది కూడా ఏమీ లేదు. బన్ని పూర్తిగా అల వైకుంఠపురంలో షూటింగ్ బిజీలోనే ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ సినిమా పైనే అని వెల్లడైంది. మరి ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో అని బన్ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: