నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో   నటిస్తోన్న 105వ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  కాగా ఈ చిత్రానికి మొదట్లో 'రూలర్' అనే టైటిల్ నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది.  దీంతో ఫ్యాన్స్ అదే కన్ఫర్మ్ అనుకున్నారు.  కానీ ఇప్పుడు కొత్త టైటిల్ తెర మీదికి వచ్చింది. ఆ టైటిలే 'జడ్జిమెంట్'. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ  కథలో బాలయ్య పాత్రకు తగిన టైటిల్ ఇదేనని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత  షెడ్యూల్ ను అక్టోబర్  16వ తేదీ  నుండి హైద‌రాబాద్ లో   ప్రారంభ‌మ‌వ్వనుంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట.  ఇక ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు.   

దసరా రోజున విడుదలైన పొస్టర్ మీద కూడా టైటిల్ కానీ దానికి సంబందించిన  ఎలాంటి క్లూ కానీ లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.  షూటింగ్ పూర్తయ్యేలోపు కనీసం టైటిల్ ఏమిటో చెప్పాలని అడుగుతున్నారు.   మరి చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.  ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.  బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్లో గత ఏడాది 'జై సింహ' అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. 

ఇక  సినిమా విషయంలో బాలకృష్ణ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపించాలని తపిస్తుంటారాయన.  ఆ తపన, డెడికేషన్ మూలంగానే బోయపాటితో చేయనున్న సినిమాలో బాడీ వేరియేషన్ చూపాలనుకుంటున్నారు.  అందుకే ప్రతిరోజు గంటలబడి వర్కవుట్స్ చేస్తున్నారట.  ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు.  సినిమా మొదలయ్యేనాటికి సుమారు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్.  సినిమాలో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.  అందుకోసం నవంబర్ నెలలో లుక్ టెస్ట్ చేయనున్నారు.  డిసెంబర్ నెల నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు.  ఇది కూడా 'సింహ, లెజెండ్' తరహాలోనే హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: