తెలుగులో చిన్న హీరోల్లో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్న హీరో నాని. అష్టా చమ్మా సినిమాతో ఎలుగు తెరకు పరిచయం అయిన నాని కొద్ది కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో నాని నటనకు జనాలు ఫిదా అయ్యి నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ని కూడా ఇచ్చారు. అయితే నాని నుండి వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికీ, వసూళ్ళపరంగా తక్కువే వచ్చిందని టాక్.


నాని గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సినిమా మొదలెట్టేశాడు. తన మొదటి సినిఆ "అష్టా చమ్మా "దర్శకుడు ఇంద్రగంటి మోహనక్రిష్ణతో "వి" నఏ సినిమా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే నాని మరో సినిమాకి ఒకే చెప్పేశాడట. నిన్ను కోరి దర్శకుడు "శివ నిర్వాణ" తో సినిమా చేయడానికి నాని ఒప్పుకున్నట్లు సమాచారం.


అయితే ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా ఉంటాడట. అంటే నాని మరోసారి మల్టీ స్టారర్ చేయబోతున్నాడు. నానితో పాటు  అరో హీరోగా ఆది పినిశెట్టి నటించనున్నాడట. నిన్ను కోరి సినిమాలో కూడా ఆది నటించాడు. శివ నిర్వాణ రాసుకున్న కథలో రెండో హీరో చాలా కీలకం అట. అందుకే దానికి ఆది పినిశెట్టి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

తన మొదటి సినిమా" నిన్ను కోరి" తో ప్రేక్షకులని ఆకట్టుకున్న శివ నిర్వాణ ఆ తర్వాత మజిలీ తో హిట్ కొట్టాడు. మరి నానితో  సినిమ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా తెలియదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నాని "వి" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: