ఎప్పటి నుంచో స్టార్ హీరోలు కేవలం స్టేజి మీద తన అభిమానుల గురించి పట్టించుకుంటున్నట్లు, ప్రేక్షకులు అంటే ప్రేమ ఉన్నట్లు ముసలి కన్నీరు కారుస్తారు అని ఒక వాదన ఉంది. నిజజీవితంలో ప్రతి ఒక్క స్టార్ హీరో చాలా వేరుగా ఉంటారు అని... కనీసం తన అభిమానులు కలిసేందుకు కూడా వారు సముఖంగా ఉండరు అంటుంటారు. అయితే ఇటువంటి ప్రవర్తన ఏనాడూ ఏ ఒక స్టార్ హీరో బహిరంగంగా చూపింది లేదు. అయితే ఇప్పుడు తెరమీదకు వచ్చిన ఈ అంశం మొత్తం తమిళ చిత్రసీమనే ఊపేసింది. అభిమానులు అంటే విపరీతమైన ఆప్యాయత ఉన్నట్టు స్టార్ హీరోలు నిజంగానే నటిస్తారా...? అన్న ప్రశ్నలను లేవనెత్తింది.

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఫాలోయింగ్ అరవంలో అంతా ఇంతా కాదు. కోలీవుడ్ రికార్డులని యావరేజ్ సినిమా తో కూడా బద్దలు కొట్టే విజయ్ గురించి ఒక ప్రముఖ దర్శకుడు నమ్మశక్యంగా లేని నిజాన్ని చెప్పాడు. అతనే ప్రముఖ దర్శకుడు సామి. తమిళ సూపర్ స్టార్ విజయ్ మనం ప్రశంసించదర్గ వ్యక్తి కాదని అతనిమీద సంచలన కామెంట్ చేశాడు. ఒకసారి అతను తన అభిమానులకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు... అంతా అయిపోయిన తర్వాత పక్కకు వెళ్లి డెటాల్ తో చేతులు కడుక్కున్నాడట. దీంతో దర్శకుడు సామి అతను స్టేజి మీద కనిపించే వ్యక్తి అయితే కాదని అతను ప్రసంగాలు సీరియస్ గా తీసుకోవద్దు అని అభిమానులకు హితవు పలికాడు. 

ఇప్పుడు ఈ విషయం తమిళనాట సంచలనంగా మారింది. కొంతమంది విజయ్ ఇలాంటి వాడా అని ఆశ్చర్యపోతుంటే మరి కొందరు మాత్రం అతను చేసిన పనిని సమర్ధిస్తున్నారు. వారి వాదన ఏమిటంటే ఒకే రోజులో ఒకేసారి ఒక 100 మందికి షేక్ హ్యాండ్ ఇస్తే కచ్చితంగా క్రిములు సోకే అవకాశాలు చాలానే ఉంటాయని అందుకని కేవలం రక్షణ కోసం డేటాక్ వాడడం అంత పెద్ద విషయమేమీ కాదని వారు అంటున్నారు. వారి వాదనలో కూడా లాజిక్ ఉన్నప్పటికీ తాను చేయి ఎందుకు కడుక్కున్న కేవలం విజయ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: