ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 ఎంతో రసవత్తరంగా ముందుకు సాగుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి. గత వారం పునర్నవి ఎలిమినేషన్ తరువాత, ఇక పై రాబోయే షో మరింత ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే ప్రతి వారం షో నుండి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ బయటకు వెళిపోతుండడంతో, చివరి వరకు ఎవరు మిగులుతారు, అసలు ఎవరికి బిగ్ బాస్ కిరీటం దక్కుతుంది అనే దానిపై ప్రేక్షకులు మరింత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 

ఇక షోలో ఇటీవల ఎలిమినేట్ అయిన పునర్నవి, బయటకు వచ్చిన తరువాత ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు ఈ షో ద్వారా మంచి గుర్తింపు లభించిందని, షోలో కొందరు బాగానే ఆడుతున్నా, మరికొందరు మాత్రం కేవలం స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పింది. ఇకపోతే తనకు మరియు రాహుల్ కు మధ్య ఏదో రిలేషన్ ఉందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లే అని అంటోంది పునర్నవి. 

నిజానికి ఈ షో కి వచ్చిన తరువాత తనకు రాహుల్ తో మంచి అనుబంధం ఏర్పడడం జరిగిందని, అది ఎంతో గొప్ప స్నేహబంధం మాత్రమేనని, అందువల్లనే నేను అతనిపై తరచు గొడవపడుతూ ఉండేదానినని అంటోంది ఈ భామ. వ్యక్తిగతంగా రాహుల్ చాలా మంచి వ్యక్తి అని, కాకపోతే తనను పూర్తిగా అర్ధం చేసుకోలేని వాళ్లే అతన్ని తప్పుగా అనుకుంటారని కూడా చెప్తోంది. అయితే మొదట్లో తమపై వస్తున్న పుకార్లకు తనకు కొంత బాధ వేసిందని, కానీ రానురాను అవి విని తాను కూడా పట్టించుకోవడం మానేశానని అంటోంది. అలానే అందరరు ప్రేక్షకుల్లానే తాను కూడా ఈ షోలో ఎవరు విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: