మంచు మనోజ్ సరసన శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మిల్కి బ్యూటీ తమన్నా ఆ సినిమాలో బాగానే నటించగా, ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ సంపాదించింది. అనంతరం సిద్ధార్థతో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో ఆమె నటించగా, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, హీరోయిన్ గా తమన్నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆపై నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన 100% సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని తమన్నా కు యూత్ లో బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ, పలువురు టాలీవుడ్ స్టార్స్ సరసన కూడా సినిమా అవకాశాలు దక్కించుకున్న తమన్నా, ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయికలో వచ్చిన ఎఫ్2, 

అలానే కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా పెట్రోమాక్స్ సినిమా ట్రైలర్ మొన్న యూట్యూబ్ లో విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. అయితే ఆ సినిమా మీడియా సమావేశంలో తమన్నాను ఒక విలేఖరి, తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా, నిజానికి నాకు ఆయనతో పెద్దగా పరిచయంలేదు, నేను ఆయనతో కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించాను, అయితే ఆ సినిమా సమయంలో ఆయనతో పెద్దగా మాట్లాడింది కూడా లేదు, మరి అటువంటపుడు నేను ఆయన గురించి ఏమి చెప్పగలను చెప్పండి అంటూ సమాధానమిచ్చారు. 

అయితే తమన్నా విజయ్ విషయమై చేసిన ఈ వ్యాఖ్యలే, ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ కు కోపాగ్నిని రగిల్చేలా చేసాయి. గతంలో కొన్ని సందర్భాల్లో తమన్నా గారు మాట్లాడుతూ, తనకు విజయ్ గారితో కలిసి నటించే ఛాన్స్ వస్తే చాలు, ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఆమెకు గుర్తు లేదా, అయినా విజయ్ వంటి సూపర్ స్టార్ గురించి తెలియదు, పరిచయం లేదు అని తమన్నా సాదాసీదాగా చెప్పడం ఆయనను అవమానించినట్లే అని, కాబట్టి ఆ విషయమై తమన్నా, తమ హీరో విజయ్ కు క్షమాపణలు చెప్పాలని పలువు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా తమన్నా పై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ మ్యాటర్ లో నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూడాలి మరి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: