తెలుగులో ప్రస్తుతం సైరా తర్వాత రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలేమీ లేవు. సైరా సినిమా బాక్సాఫీసు వద్ద  దూసుకుపొతుంది. సాహో రిలీజైన నెలకి సైరా వచ్చింది. ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కాయి. అందువల్ల ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ కి ఒక నెల గ్యాప్ వచ్చింది. అందువల్ల థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సాహో సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోయిందంటే, దానికి కారణం సాహో దరిదాపుల్లో మరే సినిమా రిలీజ్ కాకపోవడమే.


అయితే సాహో డిజాస్టర్ తర్వాత తెలుగు నుండి మరో ప్యాన్ ఇండియా మూవీ "సైరా" విడుదల అయింది. అయితే ఈ సినిమాకి హిందీలో అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. సైరా రిలీజ్ రోజునే హిందీ సినిమా వార్ కూడా రిలీజ్ అవడం వల్ల ఎక్కువ థియేటర్లు వార్ సినిమా ఆకుపై చేసుకుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సైరాకి పెద్ద అడ్డంకిగా మారింది. అయితే బాలీవుడ్ సినిమా వాళ్ళు మన సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోవడం వల్ల కలెక్షన్లు ఎక్కువ రాలేదనే వదన కుడా ఉంది.


ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఎలాంటి నష్టం వస్తుందో సైరా నే ఒక ఉదాహరణ. ఒకే రోజు తెలుగులో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సంక్రాంతి బరిలో మహేష్ నటించిన "సరిలేరు నీకెవ్వరు", అలాగే బన్నీ నటించిన "అల వైకుంఠపురములో" ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ రెండు సినిమాలు ఒకే సారి విడుదల అవడం వల్ల తెలుగు సినిమాకి భారీ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి.


రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవడం వల్ల థియేటర్లు పంచుకోబడతాయి. దానివల్ల రెండు సినిమాలు నష్టపోతాయి. అలా కాకుండా ఇరు సినిమాల నిర్మాతలు మాట్లాడుకుని  రెండు సినిమాల రిలీజ్ కి మధ్య పదిహేను రోజుల గ్యాప్ తీసుకుంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: