బిగ్ బాస్..నార్త్ అండ్ సౌత్ లో అతి పెద్ద రియాలిస్టి షో. హిందీ, తమిళం, తెలుగులో ఈ రియాలిటి షోకి ఎంతో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. వాస్తవంగా ఇలాంటి షోలకి కావాల్సిందే కాంట్రవర్సీలు. ఇక ఈ మూడు భాషల్లోను ఏదో ఒక వివాదం లేకపోతే బిగ్ బాస్ కాన్సెప్టులు ఎవరు చూస్తారు?  ఏవో సిల్లీ గేమ్స్ ఆడించేస్తూ అన్ని గంటల పాటు ఈ రియాలిటీ షోకే అంకితమవ్వమని చెప్పేంత సాహసం చేస్తారా? ఏదో స్పైసీ గా చూపించేసి ఆస్వాధించాలని ఆరాటపడే ఆడియెన్స్ ని అన్నీ రకాలుగా అట్రాక్ట్ చేసేందుకు ఏదో ఒకటి చేయాలి. అదే సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో బాగా కనిపిస్తోంది.

ఈ సీజన్ లో 'బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్' అన్న ఒక థీమ్ ఉంది. దీని ప్రకారం ఒక అమ్మాయి-ఒక అబ్బాయి ఒకే బెడ్ మీద పడుకుని స్నేహితుల్లానే కాదు అంతకుమించి కలిసిపోవచ్చు. ఇలాంటివి ఉంటేనే కదా షో కి కావలసినంత రేటింగ్ వచ్చేది. అందుకే ఈ రసవత్తర కలాపాల వేదికగా మారిన బిగ్ బాస్ -హిందీ సీజన్ 13 ఎప్పటికప్పుడు వివాదాల హోరు పీక్స్ లో ఉంటుంది. ఈ దెబ్బతో సల్మాన్ ఇంటి ముందు ఏకంగా ధర్నాలు - రాస్తారోకోలు అంటూ కర్ణిసేనలు.. సామాజిక సంఘాలు బరిలో దిగాయి. రాజకీయ నాయకులు కూడా ఈ వివాదానికి మద్దతు తెలుపుతుండడంతో హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ కాంట్రవర్సీలతో వేడెక్కుతోంది. పిచ్చి పరాకాష్టకు చేరుతున్న బిగ్ బాస్ భారతీయ సంప్రదాయాలను భగ్నం చేస్తుందని వీళ్ళతా ఫైర్ అయ్యారు. 

బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రంగా మండి పడుతున్నారు. సల్మాన్ ఇంటి పరిసరాల్లో ఆందోళనలు ఉద్రిక్తతం అవ్వడంతో పదిమందిని అరెస్ట్ చేశారు కూడా. మరి ఈ నిర్ణయంపై బిగ్ బాస్ వెనక్కి తగ్గుతాడా లేదా అన్నది ఇంకా తెలీలేదు. ఇలాంటి షోకి హోస్టింగ్ చేస్తున్నందుకు సల్మాన్ గిల్టీగా ఫీలవ్వడం లేదా అని కొంతమంది అనుకుంటున్నారట. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 సైతం కాస్టింగ్ కౌచ్ వివాదంతో రచ్చయిన సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు అదీ ఇదీ అంటూ రెండు రోజులు నానా హంగామా చేశారు. కమిట్ మెంట్ లేనిదే ఇక్కడ ఛాన్సులివ్వరని తెలుగు బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో అందరూ లైట్ తీస్కున్నారు. మరోవైపు అటు తమిళ బిగ్ బాస్ రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. మరి ఇలాంటి రియాలిటి షోస్ ముందు ముందు కంటిన్యూ అవుతాయా..లేక జరుగుతున్న పరిణామాలతో ఆపేస్తారా అన్నది ఏమీ తెలియడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: