సోమవారం బిగ్ బాస్ లోనామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యులందరూ నామినేట్ అవడం కొంచెం విచిత్రమే అయినా అలా చేయడం కరెక్టే అనే వాదన చాలా మందిలో ఉంది.  నామినేషన్ కోసం బిగ్ బాస్ టాపర్స్ ఆఫ్ ద హౌ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ని పర్ ఫార్మ్ చేయడంలో ఇంటి సభ్యులు తప్పులు చేశారు.


మొదటగా ఇంటి సభ్యులు తాము టాపర్ గా నిలవడానికి గల కారణాలు చెప్తూ, టాస్క్ లో బాగా పర్ ఫార్మెన్స్ చేసాం. ప్రతీ టాస్క్ ని బాగా ఆడాం అని చెప్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అనేదే ఒక గేమ్. హౌస్ లోఉండడం కూడా గేమ్ ఆడటమే. బిగ్ బాస్ కి వచ్చింది అంటే టాస్క్ లు ఆడటమే అనుకుంటున్నారు. ఇక రెండోది, తాను గేమ్ ని గేమ్ లానే ఆడతాను అని చెప్పిన వరుణ్ సందేశ్ తన భార్య కోసమే ర్యాంకుని వదులుకున్నానని చెప్పడం అతని డబల్ స్టాండర్డ్స్ ని తెలియజేస్తుంది.


గేమ్ లో నాకు ఎవ్వరైనా ఒకటే. వితికాని సైతం ప్రశ్నిస్తాడు అని పేరున్న వరుణ్ ఇప్పుడు ఇలా చేయడం అతని మనస్తత్వాన్ని ప్రశ్నించేదిగా ఉంది. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఇక మూడో తప్పు రాహుల్ చేశాడు. రాహుల్ ఎంతసేపూ తాను సేవ్ అవ్వాలి కాబట్టి రెండో ర్యాంక్ కోరుకుంటున్నాడు తప్పితే తనకి అర్హత ఉందని వాదించట్లేదు.


ఇక నాలుగో తప్పుకొస్తే, బాబా భాస్కర్ శ్రీముఖి చీటీ తీసిందన్న కారణంగా ఆమెకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు కానీ ఆమె వాదన నచ్చి కాదని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. అయితే అలా చేయడం వల్ల బాబా భాస్కర్ కి మంచి పేరొస్తుందేమో కానీ, గేమ్ పరంగా అలా చేయడం కరెక్ట్ కాదు. ఈ తప్పులు చేయకుండా చర్చించుకుని ఉంటే నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా జరిగేది.




మరింత సమాచారం తెలుసుకోండి: