విక్టరి వెంకటేష్ నటించిన ఎఫ్ 2 సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. అనిల్ రావిపూడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. వెంకటేష్ కి ఇంత క్రేజ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో మిగతా సినిమాలేవీ సరిగ్గా ఆడకపోవడంతో ఎఫ్ 2సినిమాకి కలిసి వచ్చిందనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా వెంకటేష్ కి ఇప్పటికీ సరైన మార్కెట్ ఉందని ప్రూవ్ చేసిన సినిమా ఎఫ్ 2

అయితే వెంకీ ప్రస్తుతం " వెంకీమామా" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. మజిలీ తర్వాత నాగచైతన్య చేస్తున్న సినిమా ఇదే. అయితే ఈ సినిమా చిత్రికరణ మొత్తం పూర్తయిందట. కానీ చాలారోజుల నుండి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. మొదట దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో దిపావళికైనా తేవాలని నిర్ణయించుకున్నారు.


కానీ ఇప్పుడది కూడా కుదరకపోవడంతో ఏకంగా రెండు నెలలు జంప్ చేసి ఇప్పుడు సంక్రాంతికి రానున్నారట. జనవరి ౧౧ వ తేదీన సినిమాని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఆ తేదీనే పరిశీలనలో ఉందట. అయితే జనవరి ౧౨వ తేదీన బన్నీ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న విషయం తెలిసిందే. 


మరి ఈ రెండు పెద్ద చిత్రాలతో వెంకీ మామా పోటీ పడగలడా అనేదే అసలు ప్రశ్న. వెంకీ మామ సినిమాలో హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడ్క్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

.




మరింత సమాచారం తెలుసుకోండి: