నామినేషన్ ప్రక్రియలో గొడవ జరిగిన కారణంగా బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేశాడు. ఇంటి సభ్యులందరూ నామినేట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత కొన్ని నిజాలు బయటపడ్డాయి. బిగ్ బాస్ లో స్నేహాలు నామినేషన్ టైంలో పనిచేయవని మరోసారి రాహుల్, వరుణ్ ల ప్రవర్తన ద్వారా రుజువైంది. అంతే కాదు బయట ఎంత మంచి స్నేహం ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో అది వేస్టే అని నిరూపితమైంది.


రాహుల్ మొదటి నుండి శ్రీముఖి అంటే విరుచుకుపడుతూనే ఉన్నాడు. అయితే ఈ మధ్య అది ఇంకా ఎక్కువైంది. ఆలీ వచ్చి రాహుల్ తో చర్చ జరపగానే తన ర్యాంక్ ఇచ్చేసి, దానికి కారణం నాకంటే ఆలీ బెటర్ క్యాండిడేట్ అని చెప్పాడు. టాస్క్ లలో అతని పర్ ఫార్మెన్స్ నాకంతే బాగుంటుంది కాబట్టి అతనికి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే టాస్క్ లలో పర్ ఫార్మ్ చేయడమే ముఖ్యమయితే శ్రీముఖి రాహుల్ కంటే గొప్పగా చేసింది.


ఏ టాస్క్ లో వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఎంటర్ టైన్ చేసింది. అలాంటిది శ్రీముఖి అడిగితే ఇవ్వలేదు సరికదా ఆమెతో వాదనకు దిగాడు. ఇక్కడ శ్రీముఖి కూడా పొరపాటు చేసి ఉండవచ్చు. కానీ రాహుల్ తన నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవని ఇంకా పెద్దది చేశాడు. అయితే అంతటితో ఆగకుండా నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఆమె గురించి ప్రతీ చోట నెగెటివ్ గా మాట్లాడాడు.


అయితే ఇంతకుముందు నుండి ఆమెతో సరైన స్నేహం లేకపోయినప్పటికీ ఇప్పటికిప్పుడు శ్రీముఖితో అలా బిహేవ్ చేయడానికి కారణం స్క్రీన్ స్పేస్ కోసమేనని వినిపిస్తోంది. హౌస్ మెంబర్స్ అందరిలోకి ఆక్టివ్ అయిన  శ్రీముఖిని టార్గెట్ చేస్తే లైమ్ లైట్ లోకి రావచ్చనే ఉద్దేశ్యంతో రాహుల్ అలా ప్రవర్తించి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి రాహుల్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: