జూనియర్ ఎన్టీయార్ తెలుగు టాప్ హీరో. మాస్ హీరో. ఇంతటి డిమాండ్ ఉన్న హీరో ఇపుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా  లాక్ అయిపోయాడు. కిందటి ఏడాది విజయదశమి వేళ పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటోంది.  పూర్తి కావ‌డానికి మరో ఏడాది పడుతుందని ఇప్పటికి అందిన సమాచారం. దాంతో జూనియ‌ర్ కాల్షీట్ల కోసం అటు ప్రొడ్యూసర్లు, ఇటు డైరెక్టర్లు క్యూ కట్టేస్తున్నారు.


జూనియర్ ఎన్టీయార్ తో తరువాత సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ  ఓ వైపు ఉన్నాడు. మరో వైపు అనిల్ రావిపూడి పేరు కూడా చెబుతున్నారు. ఇక జూనియర్ అవకాశం ఇస్తే మాస్ మూవీ తీయడానికి ఎంతో మంది తెలుగు డైరెక్టర్లు ఉండగా ఇపుడు కొత్తగా తమిళ్ టాప్ డైరెక్టర్ అట్లీ పేరు ముందుకు వస్తోంది. అట్లీ ఆర్ ఆర్ ఆర్ మూవీ కంటే ముందే జూనియర్ తో కమిట్ అయ్యాడని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోతో  మూవీని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తీస్తారని అంటున్నారు. ఈ మూవీ కోసం స్టోరీ డిస్కషన్లు అవుతున్నాయని చెబుతున్నారు.


నిజానికి జూనియర్ 2020 ఫిబ్రవరి నుంచి అట్లీ మూవీ షూటింగులో ఉండాలి. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ బాగా లేట్ అవుతుందని అంటున్నారు. దాంతో అట్లీ బాగా ఖాళీ అయిపోయాడట. మరి మధ్యలో అట్లీ వేరే మూవీ చేస్తారా లేక జూనియర్ కోసం వెయిట్ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి జూనియర్ మూవీ కోసం ఎంతో మంది ప్రొడ్యూసర్లు వెయిటింగ్. దాంతో నెక్స్ట్ మూవీ ఏంటన్నది ఇంటెరెస్టింగ్ గా ఉంది. ఏది ఎలాగున్నా జూనియర్ రెండేళ్ల పాటు కష్టపడి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రిజల్ట్ మీద కూడా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: