అదేంటి గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ ది కదా.. అంటే ఏ తండ్రి వారసత్వాన్ని కొడుకు తీసుకోకూడదా.. అందులో తప్పేముంది అనుకోవచ్చు. స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ మంచి ఫాం లో ఉన్నాడు. అదీగాక అల్లు అర్జున్ తో పాటుగా అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ కూడా ఉన్నారు. మరి వారిద్దరు ఏం చేస్తారన్నది పెద్ద డౌట్.    


అసలైతే అల్లు బాబీనే గీతా ఆర్ట్స్ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటాడని అనుకున్నారు. అల్లు శిరీష్ తను ఇంకా హీరోగా నిలబడటానికే ప్రయత్నిస్తున్నాడు. ఈమధ్యనే అల్లు అరవింద్ తన ఆస్తి మొత్తం ముగ్గురు కొడుకులకు పంచేశాడట. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బాధ్యతలు అల్లు అర్జున్ తీసుకున్నాడని టాక్.  


అందుకే ప్రస్తుతం చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం చేశాడట బన్ని. అంతేకాదు ఇక మీదట అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమాకు గీతా ఆర్ట్స్ వన్ ఆద్ ది ప్రొడ్యూసర్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా అదే తరహా సినిమాలు చేయాలని చూస్తున్నాడట.   


కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఓ పక సినిమాలు నిర్మిస్తూనే హీరోగా తన సినిమాలు తను చేస్తున్నాడు. అందుకే అల్లు అర్జున్ కూడా గీతా ఆర్ట్స్ ను ఇక మీదట్ తను నడిపించేలా ప్లాన్ చేశాడట. ఈమధ్యనే సొంత ఇంటికి శంఖుస్థాపన చేసిన అల్లు అర్జున్ ఇక మీదట చాలా మార్పులు చేయనున్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బన్ని చేతుల్లోకి వచ్చేస్తే అతని అభిరుచికి తగినట్టుగా సినిమాలు నిర్మిస్తాడని చెప్పొచ్చు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: