టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కెరీర్ పరంగా 151 సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. ఇక అతి త్వరలో ఆయన నటించబోయే 152వ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రాణం ఖరీదు సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 

సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ వరకు ఎదుగుతూ ముందుకు దూసుకెళ్లిన మెగాస్టార్ జీవితంపై బయోపిక్ ఒకటి రాబోతోంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తన బయోపిక్ విషయమై మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఒకవేళ తన బయోపిక్ ను తీయవలసి వస్తే మాత్రం, ఆ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించకూడదని అన్నారు. ఎందుకంటే, ఆ సినిమాలో నా పాత్ర తనకు జన్మనిచ్చిన తరువాత తన క్యారెక్టర్ ని తానే లోకానికి పరిచయం చేసే సన్నివేశాలు బాగుండవనేది తన అభిప్రాయం అని అన్నారు. 

అయితే రామ్ చరణ్ తప్ప మిగతా మెగా హీరోలు ఎవరైనా సరే నా బయోపిక్ లో హీరోలుగా నటిస్తే బాగుటుందని అన్నారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం  ప్రకారం, ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజీ హీరోగా పేరు సంపాదించిన మెగా హీరో ఒకరు, మెగాస్టార్ బయోపిక్ లో హీరోగా నటించడానికి సిద్ధమయినట్లు చెప్తున్నారు. ఈ విషయమై మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మరికొద్దిరోజుల్లో ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రానుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: