టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. టాలీవుడ్ అభిమానులందరికీ ఆయన ఫైట్లు అయినా...  ఆయన డైలాగులు అయినా... ఆయన డాన్సులు అయినా... ఫుల్ ఎనర్జీ ని తెచ్చి పెడుతుంటాయి. జగడం సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన రామ్ మొదటి సినిమాతోనే విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అభిమానుల ఎనర్జిటిక్ స్టార్ గా మారిపోయాడు. అయితే కొన్నాళ్లుగా కొన్ని భిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రామ్ . అయితే రామ్ ఎన్ని భిన్నమైన కథల్లో చేసినప్పటికీ... సరైన విజయం మాత్రం సాధించలేకపోయాడు. 

 

 

 

 కాగా  విజయం కోసం రామ్ వెయిట్ చేస్తున్న సమయంలో ఇస్మార్ట్  శంకర్ మూవీ తో బంపర్ విక్టరీ కొట్టాడు రామ్. తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది  ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ గెటప్ తో తెలంగాణ యాసలో తన ఎనర్జిటిక్ డైలాగులతో చింపేశాడు. అయితే క్లాస్ హీరోగా పేరున్న రామ్... ఈ సినిమాలో మాస్ లుక్ తో అదరకొట్టాడు. అటు దర్శకుడు పూరి జగన్నాధ్ కు కూడా ఈ సినిమా ఒక మంచి విజయాన్ని అందించింది. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. 

 

 

 

 

 కాగా రామ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. స్రవంతి బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.  థడమ్  అనే తమిళ చిత్రానికి రీమేక్ గా  ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే తమిళంలో మగిల్ తిరుమేని   దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ హీరోగా నటించారు. కాగా ఈ సినిమాలో రామ్ కూడా సినిమాలు ద్విపాత్రాభినయం చేయనున్నారు . తన కెరీర్లోనే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు రామ్ . కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్,  మాళవిక శర్మ లు  అలరించనున్నారు. అయితే తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో రీమేక్ చేసిన తర్వాత రామ్ కెరియర్ లో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: